సిరిసిల్లలో ‘కిలేడీ’లు.. మాటలు కలిపి.. మనీ లాగేస్తూ..

30 Jul, 2021 10:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్‌): మద్యం మత్తులో ఉన్నవారే వారి టార్గెట్‌. వారిని మాటల్లో దింపి మనీ తీసుకుని వెళ్లిపోవడంలో ఆరితేరిన ‘కిలేడీ’లు సిరిసిల్ల టౌన్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిరిసిల్ల పాతమార్కెట్‌ ఏరియాలోని కల్లు కాంపౌండ్‌ను అడ్డాగా చేసుకుని ముగ్గురు మహిళలు, మరో వ్యక్తి మందుబాబుల జేబుల్లోంచి డబ్బులు కాజేస్తున్నట్లు తెలిసింది. దీనిపై వచ్చిన సమాచారంతో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలతో పాటు మరో వ్యక్తిపై నిఘావేశారు.

ఎట్టకేలకు డబ్బులు కాజేస్తున్న విషయం నిజం అని తెలడంతో మహిళ ల ను విచారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు వీరు మూడురోజుల క్రితం రూ.30వేలు దొంగతనం చేశారని, వారి చిరునామాలు, రోజువారి పనులు తెలుసుకునే పనిలో సిరిసిల్ల టౌన్‌ పోలీసులు నిమగ్నమై నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సిరిసిల్ల టౌన్‌ ఎస్సై అపూర్వరెడ్డిని వివరణ కోరగా మూడు రోజు ల క్రితం సమాచారం వచ్చిందని దీనిపై దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.   

మరిన్ని వార్తలు