ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. ఆర్నెళ్లకే మనస్పర్థలు రావడంతో

2 Sep, 2022 14:57 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ప్రేమించుకున్న వారిద్దరినీ వివాహ బంధం ఒక్కటి చేసింది. ఆతర్వాత మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకున్నాడు. ఎస్సై గుగులోతు వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి రజినీకాంత్‌(29) గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రజినీకాంత్‌ కూలీ పనులు, బ్యాండ్‌ వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2017లో శివనగర్‌కు చెందిన యువతితో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

వివాహమైన ఆర్నెళ్లకే భార్య, భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య పుట్టింటికి వెళ్లింది. గొడవలు తీవ్రతరం కావడంతో 2021లో విడాకులు పొందారు. ప్రేమించిన అమ్మాయి  దూరమవడంతో రజినీ కాంత్‌ మనస్తాపానికి గురై తాగుడుకు బానిసయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: మైనర్‌పై లైంగిక దాడి, జైలుకెళ్లి వచ్చాక పెళ్లి.. భార్యపై అనుమానంతో

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com  

మరిన్ని వార్తలు