డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు తప్పించుకోబోయి.. చుట్టుపక్కల గమనించకపోడంతో..

9 Apr, 2022 15:52 IST|Sakshi

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు కింద పట్టుబడతాననే భయంతో పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఒక యువకుడు రైలుకింద పడి మృతి చెందిన సంఘటన రామనగర తాలూకా బసవనపుర గ్రామం వద్ద చోటుచేసుకుంది. బెంగళూరు సుంకదకట్టె నివాసి దిలీప్‌ (28) మృతి చెందిన వ్యక్తి. గురువారం రాత్రి దిలీప్, మరో ఆరుగురు యువకులు కారులో బెంగళూరు నుంచి మైసూరుకు మద్యం తాగుతూ బయలుదేరారు.

బవనపుర వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా మద్యం తాగుతున్నందుకు అరెస్టు చేస్తారనే భయంతో కారు దిగిన దిలీప్‌ రోడ్డు పక్కన రైలు పట్టాలపైకి పరుగెత్తాడు. అదే సమయంలో రైలు రావడంతో రైలు కింద పడి మృతి చెందాడు. పోలీసులు ఐదుగురు యువకులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారయ్యాడు. రామనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

చదవండి: భర్తతో దూరం.. వీఆర్వోతో మహిళకు పరిచయం.. ‘నేను మోసపోయానమ్మా’

మరిన్ని వార్తలు