No Headline

19 Nov, 2023 01:32 IST|Sakshi

సాక్షి అమలాపురం: క్రికెట్‌.. సాధారణ క్రీడ. కానీ కొందరికి ప్రాణం. క్రికెట్‌ పుట్టిన దేశం ఇంగ్లండులో కన్నా మన దేశంలోనే దీనికి ఆదరణ ఎక్కువ. కోట్లాది మంది అభిమానులున్న క్రీడ ఇదే. క్రికెట్‌నే శ్వాసించే వారు.. ధ్యానించే వారు.. ఆదరించే వారికి ఇక్కడ కొదవ లేదు. సచిన్‌ టెండూల్కర్‌ వంటి మేటి క్రీడాకారులను క్రికెట్‌ దేవుడిగా అభిమానించే వారూ ఉన్నారు. ఇంతటి ఆదరణ కలిగిన క్రికెట్‌లో ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే పండగ ప్రపంచ కప్‌. అటువంటి ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్‌ ప్రస్తుతం ఫైనల్స్‌కు చేరింది. అది కూడా అల్లాటప్పాగా కాదు.. ఇప్పటి వరకూ ఈ టోర్నమెంట్‌లో పరాజయం అనేదే లేకుండా.. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి మరీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. ఇదే సగటు అభిమానికి ప్రపంచ కప్‌ పోటీలో భారత్‌ విజయంపై ఆశలు పెంచింది. అయితే ఆస్ట్రేలియా జట్టు కూడా బలంగానే ఉందని, పోటీ హోరాహోరీగా సాగుతుందన్నది క్రికెట్‌ అభిమానుల అంచనా. ప్రపంచ కప్‌ తుది పోరు ఆదివారం అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో సగటు అభిమానిని క్రికెట్‌ ఫీవర్‌ ఊపేస్తోంది. ప్రపంచ కప్‌ ఫైనల్స్‌కు భారత్‌ జట్టు చేరిప్పటి నుంచీ జిల్లాలో క్రికెట్‌ క్రీడాకారులు, అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ కప్‌ గెలిచిన మన జట్టు ముచ్చటగా మూడోసారి గెలవాలని సగటు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం 2003 ప్రపంచ కప్‌ పోటీల ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయానికి బదులు తీర్చుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. కొంతమంది వీరాభిమానులు విజయం కోసం దేవుళ్లకు మొక్కుతున్నారు.

ఫ నేడు ప్రపంచ కప్‌ క్రికెట్‌ తుది సంగ్రామం

ఫ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులు

ఫ ప్రత్యేకంగా ఏర్పాట్లు.. పలుచోట్ల బెట్టింగులు

ఫ మూడోసారి కప్పు కొట్టాలని మొక్కుబడులు

ఫ జాతీయ జెండాలకు..

టీమ్‌ ఇండియా టీ షర్ట్‌లకు గిరాకీ

ఫ రాజమహేంద్రవరంలో భారీ స్క్రీన్‌ ఏర్పాటు

మరిన్ని వార్తలు