ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

19 Nov, 2023 01:32 IST|Sakshi
లోయర్‌ కౌశికలో డ్రెడ్జింగ్‌ పనులు ప్రారంభిస్తున్న మంత్రి విశ్వరూప్‌

అల్లవరం: మండలంలోని కోడూరుపాడు పంచాయతీ పరిధిలో దేశికోడు డ్రైయిన్‌పై 1.8 కిలోమీటరు వద్ద రూ.40 లక్షలతో సైఫన్‌ నిర్మాణానికి కలెక్టర్‌ హిమాన్షు శుక్లాతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే ఎస్‌.పల్లిపాలెం వద్ద లోయర్‌ కౌశిక డ్రెయిన్‌ నుంచి ఎన్‌.రామేశ్వరం బ్రిడ్జి వరకూ సుమారు కిలోమీటరు పొడవునా రూ.87 లక్షలతో చేపట్టే డ్రెడ్జింగ్‌ పనులను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సామంతకుర్రు నుంచి ఎన్‌.రామేశ్వరం వరకూ లోయర్‌ కౌశికలో డ్రెడ్జింగ్‌ నిర్వహించి, పూడిక తొలగించడం ద్వారా.. అల్లవరం, అమలాపురం, అయినవిల్లి, ఉప్పలగుప్తం మండలాల్లోని సుమారు 30 వేల ఎకరాలకు వచ్చే ఖరీఫ్‌ నుంచి ముంపు సమస్య తీరుతుందని అన్నారు. సైఫన్‌ నిర్మాణంతో పాటివారిపాలెం ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని చెప్పారు. దేశికోడు డ్రెయిన్‌లో భారీగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మరో రూ.1.85 కోట్లతో పూడికతీత పనులు చేయాల్సి ఉందని, ఇవి కూడా చేపడితే ముంపు బెడదకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి విశ్వరూప్‌ చెప్పారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, దేశానికి వెనెముక అయిన రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతమి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ దంగేటి డోలామణి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కర్రి రామరాజు, జిల్లా ఉద్యాన శాఖ డైరెక్టర్‌ జున్నూరి వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా ఎస్‌ఈ జి.శ్రీనివాస్‌, డ్రెనేజీ శాఖ ఈఈ ఏడుకొండలు, డీఈ కిషోర్‌, ఏఈ సునీతాదేవి, ఎంపీడీఓ కృష్ణమోహన్‌, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఫ మంత్రి పినిపే విశ్వరూప్‌

ఫ రూ.40 లక్షలతో సైఫన్‌,

రూ.87 లక్షలతో డ్రెడ్జింగ్‌ పనులకు

శంకుస్థాపన

ఫ వచ్చే ఖరీఫ్‌ నుంచి 30 వేల

ఎకరాలకు తప్పనున్న ముంపు బెడద

మరిన్ని వార్తలు