జపాన్‌కు కొత్త ఏలిక

16 Sep, 2020 01:55 IST|Sakshi

గత నెలలో అనారోగ్య కారణాలతో పదవినుంచి తప్పుకున్న జపాన్‌ ప్రధాని షింజో అబే స్థానంలో యొషిహిడే సుగా ఆదివారం ఎంపికయ్యారు. ఇంతవరకూ ప్రధాన కేబినెట్‌ కార్యదర్శిగా వున్న సుగాకు అధికార పక్షం లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ సమావేశంలో భారీగా ఓట్లు వచ్చాయి. జపాన్‌ పార్లమెంటు డైట్‌లో బుధవారం ఆయన ఎంపికపై ఓటింగ్‌ జరుగుతుంది. అబే పాలనలో సుగా పేరు ఎక్కడా వినపడలేదు. బయటి ప్రపంచానికి కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు. ఆయన ఏ దేశానికీ వెళ్లింది లేదు. తన దౌత్య నైపుణ్యాన్ని చూపిన సందర్భం లేదు.  కానీ అబే ప్రభుత్వం తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం రూపకల్పనలోనూ, దాన్ని పకడ్బందీగా అమలు చేయడంలోనూ సుగాదే కీలక పాత్ర. కనుక మన దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడంతోసహా ఆ పాత విధానాలు యధాతథంగా కొనసాగుతాయనే చెప్పాలి. అయితే అధికారంలోకొచ్చాక సుగా పరిష్కరించాల్సిన సమస్యలు చాలావున్నాయి. అవన్నీ సంక్లిష్టమైనవి. 2012లో షింజో అబే అధికా రంలోకి వచ్చే సమయానికి జపాన్‌ అన్నివిధాలా నీరసించివుంది. దాన్ని చక్కదిద్దడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఆయన చేసి చూపించారు. కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడక పోతే ఆ జైత్రయాత్ర కొనసాగేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ప్రపంచ దేశాలన్నిటిలాగే ఆర్థికంగా అది దెబ్బతింది. ఆర్నెల్లుగా తయారీ రంగం స్తంభించింది. ఇప్పుడిప్పుడే అది పట్టాలెక్కుతున్న సూచ నలు కనబడుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి అంతక్రితంతో పోలిస్తే మెరుగైంది. అయితే గతంతో పోలిస్తే చైనాతో వివాదం ముదురుతోంది. దానితో జాగ్రత్తగా వ్యవహించడం సుగాకు సవాలే. 
ప్రధాని పదవి చేపట్టేనాటికి, ఇప్పుడు వైదొలగుతున్న సమయానికి మధ్య షింజో అబే వైఖరిలో వచ్చిన మార్పులు గమనించదగ్గవి. వాటినుంచి సుగా కొత్తగా నేర్చుకోవాల్సిందేమీ లేదు. ఎందు కంటే ఆ మార్పుల వెనక ముఖ్యపాత్ర ఆయనదే. ప్రారంభంలో అబే జాతీయవాది. స్వేచ్ఛా విపణికి తీవ్ర వ్యతిరేకి. విశాల పసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీ) తమకు అంగీకారం కానేకాదని 2012కు ముందు ఆయన గట్టిగా వాదించేవారు. ఇప్పుడంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ టీపీపీతో సహా అంతర్జాతీయ ఒప్పందాలు ఏవీ పనికిరావంటున్నారు గానీ... అందుకు చొరవ తీసుకున్నదీ, అందరినీ అందులో చేరేలా ఒప్పించిందీ అమెరికాయే. దానికి అబే తీవ్ర వ్యతిరేకి. పసి ఫిక్‌ మహాసముద్ర ప్రాంత దేశాలు సభ్య దేశాలుగా ఉండాలని ప్రతిపాదించిన ఈ ఒప్పందంలో మన దేశాన్ని కూడా భాగస్వామిగా మార్చాలని అమెరికా అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించింది. అందుకు సంబంధించిన చర్చల్లో మన దేశం పలుమార్లు పాల్గొంది. చివరకు చేరబోనని మన దేశం చెప్పింది. రెండున్నరేళ్లక్రితం అమెరికాయే దాన్నుంచి తప్పుకుంది. కానీ 2018లో అబే మిగిలిన దేశాలను కలుపుకుని దానికి విశాల పసిఫిక్‌ భాగస్వామ్య దేశాల సమగ్ర, పురోగామి ఒప్పందం(సీపీటీపీపీ)గా పేరుమార్చారు. ఇదే కాదు... ఇలాంటి మరో డజను ఒప్పందాలు అమలు కావాలన్న కృతనిశ్చ యంతో అబే వున్నారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకు అమెరికా, చైనాలు రెండూ ముప్పుగా పరి ణమిస్తున్నాయన్నదే ఆయన వాదన. అమెరికాతో సహా అన్ని దేశాలూ ఆత్మరక్షణ విధానాల్లో పడి, వలసలపై ఆంక్షలు విధిస్తే... అబే దానికి భిన్నంగా వలస నిబంధనలు సరళం చేశారు. కనుకనే జపాన్‌లో ప్రస్తుతం 17 లక్షలమంది విదేశీ  కార్మికులు పనిచేస్తున్నారు. అబే అధికారంలోకి వచ్చే నాటితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. సారాంశంలో ఫక్తు జాతీయవాదిగా రంగం మీదికొచ్చిన అబే... ప్రపంచ మార్కెట్‌కు తిరుగులేని నాయకుడిగా రూపొందారు. అలాగని ఆయన దేశంలో అన్నిటినీ  ప్రైవేటుపరం చేయాలనే స్వేచ్ఛా మార్కెట్‌ ఉదారవాది కాదు. ఆర్థిక వ్యవస్థపై బలమైన  ప్రభుత్వ నియంత్రణ వుండాలని కోరుకున్న నాయకుడే. అయితే కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి జపాన్‌ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఆశించిన ఫలితాల నివ్వలేదు. వేరే దేశాలతో పోలిస్తే అది మెరుగుపడింది. కానీ అనుకున్న స్థాయిలో లేదు. ఇందుకు కారణం మౌలిక సంస్కరణల అమలులో వెనుకంజేనని ఆర్థిక నిపుణులంటారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనాల తర్వాతి స్థానం జపాన్‌దే. అమెరికాతో జపాన్‌కు గట్టి స్నేహసంబంధాలున్నాయి. అదే సమయంలో చైనాతోనూ దానికి సుహృద్భావ సంబంధాలే కొనసా గుతున్నాయి. అయితే చైనాకు చెందిన హువీ టెక్నాలజీ సంస్థ 4జీ పరికరాలను వినియోగించరాదన్న అమెరికా ఆంక్షలకు జపాన్‌ కూడా తలొగ్గింది. అందువల్ల అనేకానేక సమస్యలు కూడా ఎదుర్కొంటోంది. హువీకి, ఇతర చైనా కంపెనీలకు అవసరమైన విడి భాగాలు తయారుచేసే పరిశ్రమలు జపాన్‌వే. చైనాకు జపాన్‌ వార్షిక ఎగుమతులు నిరుడు 14,000 కోట్ల డాలర్లు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ మరీ దిగజారకుండా జపాన్‌ను ఎంతో కొంత కాపాడినవి ఈఎగుమతులే. జపాన్‌ జాతీయ భద్రతతోపాటు, తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో వున్న విభేదాలు జపాన్‌ కంపెనీలకు ప్రాణాంతకంగా మారాయి. స్వీయప్రయోజనాలైతే తప్పదుగానీ అమెరికా కోసం, అది ఆదేశించేవిధంగా వ్యవహరిస్తే నష్టపోయేదే ఎక్కువుంటుందని జపాన్‌ పారిశ్రామికవేత్తలు అభి ప్రాయపడుతున్నారు. చైనాతో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగితే తమ లాభాలకు ఢోకా వుండదని వారి అభిప్రాయం. ఏతావాతా అటు దేశ భద్రతనూ, ఇటు ఆర్థిక ప్రయోజనాలనూ దృష్టిలో వుంచుకుని సుగా జాగ్రత్తగా అడుగులేయాల్సివుంటుంది. రాజకీయాలంటే తెలియని అతి సాధారణ రైతు కుటుంబంనుంచి వచ్చిన సుగా ఎల్‌డీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. అబే పదవీకాలం ఇంకా ఏడాది మిగిలింది గనుక అంతవరకూ కొనసాగి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారా లేక మరికొన్ని నెలల తర్వాత మధ్యంతర ఎన్నికలకు మొగ్గుచూపుతారా అన్నది మున్ముందు తెలుస్తుంది.షింజో అబే స్థానంలో యొషిహిడే సుగా ఆదివారం ఎంపికయ్యారు. ఇంతవరకూ ప్రధాన కేబినెట్‌ కార్యదర్శిగా వున్న సుగాకు అధికార పక్షం లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ సమావేశంలో భారీగా ఓట్లు వచ్చాయి. జపాన్‌ పార్లమెంటు డైట్‌లో బుధవారం ఆయన ఎంపికపై ఓటింగ్‌ జరుగుతుంది. అబే పాలనలో సుగా పేరు ఎక్కడా వినపడలేదు. బయటి ప్రపంచానికి కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు. ఆయన ఏ దేశానికీ వెళ్లింది లేదు. తన దౌత్య నైపుణ్యాన్ని చూపిన సందర్భం లేదు.  కానీ అబే ప్రభుత్వం తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం రూపకల్పనలోనూ, దాన్ని పకడ్బందీగా అమలు చేయడంలోనూ సుగాదే కీలక పాత్ర. కనుక మన దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడంతోసహా ఆ పాత విధానాలు యధాతథంగా కొనసాగుతాయనే చెప్పాలి. అయితే అధికారంలోకొచ్చాక సుగా పరిష్కరించాల్సిన సమస్యలు చాలావున్నాయి. అవన్నీ సంక్లిష్టమైనవి. 2012లో షింజో అబే అధికా రంలోకి వచ్చే సమయానికి జపాన్‌ అన్నివిధాలా నీరసించివుంది. దాన్ని చక్కదిద్దడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఆయన చేసి చూపించారు. కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడక పోతే ఆ జైత్రయాత్ర కొనసాగేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ప్రపంచ దేశాలన్నిటిలాగే ఆర్థికంగా అది దెబ్బతింది. ఆర్నెల్లుగా తయారీ రంగం స్తంభించింది. ఇప్పుడిప్పుడే అది పట్టాలెక్కుతున్న సూచ నలు కనబడుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి అంతక్రితంతో పోలిస్తే మెరుగైంది. అయితే గతంతో పోలిస్తే చైనాతో వివాదం ముదురుతోంది. దానితో జాగ్రత్తగా వ్యవహించడం సుగాకు సవాలే. 

ప్రధాని పదవి చేపట్టేనాటికి, ఇప్పుడు వైదొలగుతున్న సమయానికి మధ్య షింజో అబే వైఖరిలో వచ్చిన మార్పులు గమనించదగ్గవి. వాటినుంచి సుగా కొత్తగా నేర్చుకోవాల్సిందేమీ లేదు. ఎందు కంటే ఆ మార్పుల వెనక ముఖ్యపాత్ర ఆయనదే. ప్రారంభంలో అబే జాతీయవాది. స్వేచ్ఛా విపణికి తీవ్ర వ్యతిరేకి. విశాల పసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీ) తమకు అంగీకారం కానేకాదని 2012కు ముందు ఆయన గట్టిగా వాదించేవారు. ఇప్పుడంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ టీపీపీతో సహా అంతర్జాతీయ ఒప్పందాలు ఏవీ పనికిరావంటున్నారు గానీ... అందుకు చొరవ తీసుకున్నదీ, అందరినీ అందులో చేరేలా ఒప్పించిందీ అమెరికాయే. దానికి అబే తీవ్ర వ్యతిరేకి. పసి ఫిక్‌ మహాసముద్ర ప్రాంత దేశాలు సభ్య దేశాలుగా ఉండాలని ప్రతిపాదించిన ఈ ఒప్పందంలో మన దేశాన్ని కూడా భాగస్వామిగా మార్చాలని అమెరికా అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించింది. అందుకు సంబంధించిన చర్చల్లో మన దేశం పలుమార్లు పాల్గొంది. చివరకు చేరబోనని మన దేశం చెప్పింది. రెండున్నరేళ్లక్రితం అమెరికాయే దాన్నుంచి తప్పుకుంది. కానీ 2018లో అబే మిగిలిన దేశాలను కలుపుకుని దానికి విశాల పసిఫిక్‌ భాగస్వామ్య దేశాల సమగ్ర, పురోగామి ఒప్పందం(సీపీటీపీపీ)గా పేరుమార్చారు. ఇదే కాదు... ఇలాంటి మరో డజను ఒప్పందాలు అమలు కావాలన్న కృతనిశ్చ యంతో అబే వున్నారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకు అమెరికా, చైనాలు రెండూ ముప్పుగా పరి ణమిస్తున్నాయన్నదే ఆయన వాదన. అమెరికాతో సహా అన్ని దేశాలూ ఆత్మరక్షణ విధానాల్లో పడి, వలసలపై ఆంక్షలు విధిస్తే... అబే దానికి భిన్నంగా వలస నిబంధనలు సరళం చేశారు. కనుకనే జపాన్‌లో ప్రస్తుతం 17 లక్షలమంది విదేశీ  కార్మికులు పనిచేస్తున్నారు. అబే అధికారంలోకి వచ్చే నాటితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. సారాంశంలో ఫక్తు జాతీయవాదిగా రంగం మీదికొచ్చిన అబే... ప్రపంచ మార్కెట్‌కు తిరుగులేని నాయకుడిగా రూపొందారు. అలాగని ఆయన దేశంలో అన్నిటినీ  ప్రైవేటుపరం చేయాలనే స్వేచ్ఛా మార్కెట్‌ ఉదారవాది కాదు. ఆర్థిక వ్యవస్థపై బలమైన  ప్రభుత్వ నియంత్రణ వుండాలని కోరుకున్న నాయకుడే. అయితే కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి జపాన్‌ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఆశించిన ఫలితాల నివ్వలేదు. వేరే దేశాలతో పోలిస్తే అది మెరుగుపడింది. కానీ అనుకున్న స్థాయిలో లేదు. ఇందుకు కారణం మౌలిక సంస్కరణల అమలులో వెనుకంజేనని ఆర్థిక నిపుణులంటారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనాల తర్వాతి స్థానం జపాన్‌దే. అమెరికాతో జపాన్‌కు గట్టి స్నేహసంబంధాలున్నాయి. అదే సమయంలో చైనాతోనూ దానికి సుహృద్భావ సంబంధాలే కొనసా గుతున్నాయి. అయితే చైనాకు చెందిన హువీ టెక్నాలజీ సంస్థ 4జీ పరికరాలను వినియోగించరాదన్న అమెరికా ఆంక్షలకు జపాన్‌ కూడా తలొగ్గింది. అందువల్ల అనేకానేక సమస్యలు కూడా ఎదుర్కొంటోంది. హువీకి, ఇతర చైనా కంపెనీలకు అవసరమైన విడి భాగాలు తయారుచేసే పరిశ్రమలు జపాన్‌వే. చైనాకు జపాన్‌ వార్షిక ఎగుమతులు నిరుడు 14,000 కోట్ల డాలర్లు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ మరీ దిగజారకుండా జపాన్‌ను ఎంతో కొంత కాపాడినవి ఈఎగుమతులే. జపాన్‌ జాతీయ భద్రతతోపాటు, తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో వున్న విభేదాలు జపాన్‌ కంపెనీలకు ప్రాణాంతకంగా మారాయి. స్వీయప్రయోజనాలైతే తప్పదుగానీ అమెరికా కోసం, అది ఆదేశించేవిధంగా వ్యవహరిస్తే నష్టపోయేదే ఎక్కువుంటుందని జపాన్‌ పారిశ్రామికవేత్తలు అభి ప్రాయపడుతున్నారు. చైనాతో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగితే తమ లాభాలకు ఢోకా వుండదని వారి అభిప్రాయం. ఏతావాతా అటు దేశ భద్రతనూ, ఇటు ఆర్థిక ప్రయోజనాలనూ దృష్టిలో వుంచుకుని సుగా జాగ్రత్తగా అడుగులేయాల్సివుంటుంది. రాజకీయాలంటే తెలియని అతి సాధారణ రైతు కుటుంబంనుంచి వచ్చిన సుగా ఎల్‌డీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. అబే పదవీకాలం ఇంకా ఏడాది మిగిలింది గనుక అంతవరకూ కొనసాగి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారా లేక మరికొన్ని నెలల తర్వాత మధ్యంతర ఎన్నికలకు మొగ్గుచూపుతారా అన్నది మున్ముందు తెలుస్తుంది.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా