కలుషిత దగ్గుమందు : ఉజ్బెకిస్థాన్‌ కోర్టు సంచలన తీర్పు

27 Feb, 2024 11:14 IST|Sakshi

 నాణ్యత లేని దగ్గుమందు, చిన్నారుల దుర్మరణం

భారతీయునికి ఉజ్బెకిస్థాన్‌లో 20 ఏళ్ల శిక్ష 

మొత్తం  లైసెన్స్‌ ఇచ్చిన అధికారులు సహా 23 మందికి జైలు శిక్ష

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పత్తి చేసిన కలుషిత దగ్గు సిరప్‌ను సేవించి 68 మంది చిన్నారులు మరణించిన కేసులో  కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉజ్బెకిస్థాన్‌లోని ఒక భారతీయ పౌరుడికి సోమవారం ఉజ్బెకిస్థాన్  కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఔషధం  దిగుమతి లైసెన్సు  ఇచ్చిన   మాజీ సీనియర్ అధికారులను కూడా దోషులుగా తేల్చింది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం దగ్గు మందు అమ్మకమే 68 మంది పిల్లల మరణాలకు కారణమని కోర్టు తేల్చింది.  కలుషిత దగ్గు మందును విక్రయించాడంటూ భారత పౌరుడు, మారియన్ బయోటెక్ తయారు చేసిన ఔషధాలను పంపిణీ  సంస్థ క్యూరామాక్స్ మెడికల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగ్ రాఘవేంద్ర ప్రతార్‌కు  ఉజ్బెకిస్థాన్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే పన్నుల ఎగవేత, నాసిరకం, కలుషిత మందుల అమ్మకం, పదవీ దుర్వినియోగం, నిర్లక్ష్యం, ఫోర్జరీ, లంచం ఇవ్వడం లాంటి నేరాలు రుజువైనందుకు ఆయనతోపాటు 22 మందికి రెండు నుంచి 20 ఏండ్ల వరకు జైలు శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పింది.

మరో  23 మంది వ్యక్తులకు రెండు నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు 80 వేల అమెరికా డాలర్లు) పరిహారంగా చెల్లించాలని కూడా ఉజ్బెకిస్తాన్ కోర్టు తీర్పునిచ్చింది దగ్గు మందు తాగి వికలాంగులైన నలుగురు పిల్లల కుటుంబాలకు కూడా నష్టపరిహారాన్ని చెల్లిస్తారు.

కాగా ఉజ్బెకిస్తాన్‌లో భారతీయ దగ్గు సిరప్‌ల వాడకంపై  తొలుత WHO హెచ్చరికలు జారీ చేసింది. ఉజ్బెకిస్థాన్‌లో భారత్‌లో తయారైన దగ్గు మందు వాడిన కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి.  డ్రగ్స్ తయారీదారు లైసెన్స్‌ను భారత్ రద్దు చేసింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు