కడుపుతో ఉన్నానంటూ ఓ మహిళ..ఏకంగా రూ. 98 లక్షలు..!

20 Feb, 2024 15:22 IST|Sakshi

కొందరూ ప్రభుత్వం ఇచ్చే పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఎంతలా కక్కుర్తిపడుతుంటారో తెలిసిందే. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఎలాంటి పనులైన చేస్తారు. కానీ మరీ ఇలా గర్భాల పేరుతో లక్షల్లో డబ్బు కొట్టేయడం చూసి ఉండరు. పోనీ ఒకటో రెండో ప్రశూతి ప్రయోజనాలు కాదు. ఏకంగా ఎన్నిసార్లు ఇలా బూటకపు గర్భాల గురించి అబద్ధాలు చెప్పిందో వింటే కంగుతింటారు. అలాగే ప్రశూతి ప్రయోజనాలకు సంబంధించిన డబ్బు ఎంత మేర కొట్టేసిందో విన్నా వామ్మో! అంటారు. ఏం జరిగిందంటే..

ఇటలీలోని రోమ్‌కి చెందిన 50 ఏళ్ల బార్బరా నకిలీ గర్భాల పేరుతో దాదాపు రూ. 98 లక్షల దాక ప్రసూతి ప్రయోజనాలను కొట్టేసింది. నిజానికి ఆమె గర్భం దాల్చిన సమయంలో కలిగిన పిల్లల గురించి ఏ ఆస్పత్రిలో నమోదు కాలేదు, అధికారులెవ్వరూ కూడా ఆమె పిల్లలను చూడలేదు కూడా. ఆమె రోమ్‌లో ఉన్న క్లినిక్‌ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాను దొంగలించి అచ్చం అదే మాదిరిగా తన పేరుతో సర్టిఫికేట్లను సృష్టించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేది. ఇలా 24 ఏళ్ల కాలంలో 12 గర్భస్రావాలు జరిగినట్లు, ఐదు మంది పిల్లలు కలిగినట్లు పేర్కొంది. మొత్తంగా 17 బూటకపు గర్భాలతో  అధికారులను మోసం చేసింది. అంతేగాక తాజాగా ఇటీవల గత డిసెంబర్‌లో​ తాను మరో బిడ్డను ప్రసవించినట్లు పేర్కొంది. దీంతో అనుమానం వచ్చి ఆ 50 ఏళ్ల మహిళ గురించి గత తొమ్మిది నెలలుగా గట్టి నిఘా పెట్టారు.

ఆ విచారణలో ఆమె గర్భం అంతా ఓ బూటకమని తేలింది. బేబీ బంప్‌లా కనిపించేందుకు దిండ్లను ఉపయోగించనట్లు వెల్లడయ్యింది. పైగా పుట్టబోయే బిడ్డను మోస్తున్నట్లుగా చాలా బరువు మోస్తున్నట్లు ఫోజులిచ్చేదని అధికారుల చెబుతున్నారు. ఆఖరికి ఆమె భర్త డేవిడ్‌ పిజ్జినాటోని కూడా ఈ విషయమై ప్రశ్నించగా..తన భార్య గర్భవతి కాదని విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసుల సదరు మహిళ లోయెల్‌, ఆమె భర్తపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరు ఇటాలియన్‌ హెల్త్‌ అసిస్టెన్స్‌నే మోసం చేశారంటూ మండిపడింది.

ప్రజా సంస్థను మోసం చేయడమే గాదు దానికి హాని తలపెట్టారని చివాట్లు పెట్టింది. ప్రజా ప్రయోజనంలో భాగంగా సదరు రాష్ట్రం మహిళలకు అందించే ప్రశూతి ప్రయోజనాలను దుర్వినియో పరిచారని ఫైర్‌ అయ్యింది. అలాగే తనకు ఐదుగురు పిల్లలు ఉన్నారని పలుసార్లు గర్భస్రావాలు జరిగినట్లు తప్పుడు పత్రాల సమర్పించడమే గాక దాన్నే కొనసాగించే య్నతం చేయడం మరింత నేరం అని స్పష్టం చేసింది. అందుకుగానూ లోయెల్‌కి ఒక ఏడాది ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఈ నేరంలో సహకరించిన ఆమె భర్తకు కూడా శిక్ష విధించింది.

(చదవండి: 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!)

whatsapp channel

మరిన్ని వార్తలు