Liver Cancer Fish Dish: అక్కడ చేపలు జస్ట్‌ తినడానికి ట్రై చేసినా చాలు..క్యాన్సర్‌ ఖాయం!

13 Oct, 2023 11:41 IST|Sakshi

చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు. పైగా చేపనూనె లేదా చేపతో చేసిన రెసిపీలు కనీసం వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలా మంచిదని పదేపదే ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు కూడా. కానీ ఆ దేశంలోని చేపలు గురించి వైద్యులు చెబుతున్న షాకింగ్‌ విషయాలు వింటే వెంటనే మీ నిర్ణయం మార్చుకుంటారు. ఎందుకంటే చేపలను జస్ట్‌ తినాలని ట్రై చేసినా చాలు మందులతో కూడా నయం చేయలేని భయానక క్యాన్సర్‌ రావడం పక్కా అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. అక్కడ చేపలతో చేసిన వంటకాలనే అక్కడ ప్రజలు చచ్చేంత ఇష్టంగా తింటారట. ఆ చేప కథకమామీషు ఏంటో చూద్దాం!.

థాయ్‌ వంటకాలకు అత్యంత రుచికర, ఆరోగ్యకరమైన వంటకాలుగా మంచి ప్రసిద్ధి. కానీ అక్కడ ఓ చేప వంటకం మాత్రం చాలా డేంజర్‌ అని దాదాపు 20 వేల మంది మరణాలకు కారణమైందని వైద్యులు షాకింగ్‌ విషయాలు చెబుతున్నారు. థాయ్‌లోని కోయి ప్లా అనే మంచి నీటి చేప చాలా ప్రమాదకరమైందని ఒక్కసారి తిన్నా చాలు ఆ క్యాన్సర్‌ బారిన పడటం ఖాయం అంటున్నారు వైద్యులు. కానీ అక్కడ ఈ చేపకు సంబంధించి వివిధ రకాల వంటకాలకు చాలా ప్రసిద్ధి. పైగా ప్రజలు కూడా ఆ చేప వంటకాలను తెగ ఇష్టంగా తింటుంటారు. థాయ్‌లోని ఖోన్‌సాన్‌, ఇసాన్‌ వంటి ప్రాంతాల్లో ఈ చేప వంటకాలను ఎక్కువగా తింటారట.

ఈ వంటకానికి సంబంధించి కొంచెం తిన్నా చాలు ఆ భయనక క్యాన్సర్‌ కచ్చితంగా వస్తుందని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది తిన్న వారికి కొద్ది రోజులు లేదా నెలల్లోనే కాలేయ సంబంధ క్యాన్సర్‌ వ్యాధి బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ చేపలో లివర్‌ ఫ్లూక్‌ అనే ఫ్లాట్‌ వార్న్‌ పరాన్నజీవి ఉందని ఇది కాలేయం పిత్తాశయం, చిన్నపేగులను కలిపి ఉండే ప్రాంతంలో దాడి చేసి పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్‌కి దారితీస్తుందని అంటున్నారు.

ఈ చేపలను తినే ఆయా ప్రాంతాల్లో సర్వే చేయగా..దాదాపు 80 శాంత మంది శరీరంలో ఆ పరాన్నజీవి ఉందని వారంతా కూడా పిత్తాశయం లేదా కాలేయం క్యాన్సర్‌ బారిన పడినట్లు తేలిందని వెల్లడైంది. ఆయా బాధితులకు చికిత్స అందించడం కూడా ఓ సవాలుగా ఉందన్నారు. అంతేగాదు బాధితుల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్‌ ఏ స్టేజ్‌లో ఉందన్న నిర్థారణ ఆధారంగానే ఆ వ్యక్తలు నెలలు లేదా సంవత్సరాలు బతకగలరని అంచనా వేసి చెప్పగలం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ క్యాన్సర్‌ లక్షణాలు..

  • పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్‌ వచ్చే వ్యక్తుల్లో కళ్లు చర్మం పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది,
  • చర్మం చాలా దురదగా ఇరిటేషన్‌గా ఉంటుంది. 
  • ఆకలిని కోల్పోవడం. ఏ ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం
  • సడెన్‌గా అధిక ఉష్ణోగ్రత లేదా వణుకుపోతున్న ఫీలింగ్‌
  • ఈ చేపల్లోని ఫ్లాట్‌ వార్మ్‌ పిత్తవాహికలో ఏళ్ల తరబడి నివశిస్తాయని చెబుతున్నారు వైద్యులు. వైద్య పరీక్షలు చేసినప్పుడు కూడా కాలేయ వాపుగానే కనిపిస్తుందని వాటిని గుర్తించలేం అని తెలిపారు ఆరోగ్య నిపుణులు. మనిషి బలహీనపడినప్పుడూ ఒకేసారి ఆ పరాన్నజీవి విజృంభించడం మొదలు పెట్టి క్యాన్సర్‌ బారిన పడేల చేస్తుందని చెబుతున్నారు. 

(చదవండి: ఓ మహిళకి క్యాన్సర్‌ థర్డ్‌ స్టేజ్‌!ఎలాంటి సర్జరీ లేకుండానే..)

మరిన్ని వార్తలు