మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

18 Jan, 2024 12:28 IST|Sakshi

మన  వంటింట్లో దొరికే మెంతులతో చాలా ఆరోగ్య  ప్రయోజనాలున్నాయి.  కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే  కాదు. అతివలకు మెంతుల వల్ల  జరిగే మేలు అంతా ఇంతా కాదు. మ‌ధుమేహం స‌హా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు అవి ఔష‌ధంలా ప‌నిచేస్తాయి.  తినడానికి చిరు చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక  భాగంగా చేసుకుంటారు. అందుకే పోపు గింజల్లో మెంతులును ప్రధానంగా చేర్చారు మన పెద్ద వాళ్లు. పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు పురుషులు,స్త్రీలలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవ‌డం ద్వారా వివిధ ర‌కాల అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌రి మెంతుల‌లో దాగి ఉన్న ఆ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసుకుందామా..?

ప్రయోజనాలు
మెంతులు (ట్రైగోనెల్లా ఫోనమ్-గ్రేకమ్) అనేది బఠానీ కుటుంబానికి (ఫాబేసి) చెందిన సుగంధ ద్రవ్యం.
⇒ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
⇒ జుట్టు పెరుగుదలకు మంచిది 
 బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును   అదుపులో ఉంచుకుంది. 
⇒ జ్వరం, అలెర్జీల , గాయాల చికిత్సలో


మెంతులు మన ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో బాగా ప‌నిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, క‌డుపుబ్బ‌రాన్ని కూడా త‌గ్గిస్తాయి. కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలంటారు నిపుణులు. మెంతుల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది.అంటే ఒంట్లో కొవ్వు క‌రుగుతుంది. 

రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజ‌ల‌ను నీళ్ల‌లో నాన‌బెట్టి ఉద‌యం లేవ‌గానే ప‌రగ‌డుపున ఆ నీళ్ల‌ను తాగాలి. ఇలా చేయ‌డంవ‌ల్ల‌ అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ శ‌క్తి మెరుగు ప‌డుతుంది. అదేవిధంగా విరేచ‌నాలు త‌గ్గ‌డానికి కూడా మెంతులు ఉప‌యోగ‌ప‌డుతాయి. మెంతి టీ ద్వారా బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది. చిటపట శబ్దం వచ్చేదాకా మెంతులను వేయించి మెత్తగా పౌడర్‌లా చేసుకుని , రోజూ ఉద‌యాన్నే ఆ పొడిని వేడి నీటిలో క‌లుపుకుని తాగితే ఎన్నో  స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

మెంతులు-ఇంతులు
మహిళలు  సౌందర్య పోషణలో కూడా  మెంతులకు విరివిగా వాడవచ్చు  బాగా మెత్తగా దంచిన మెంతిపౌడర్‌లో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమంతో  ముఖాన్ని  సున్నితంగా  స్క్రబ్‌ చేసుకోవాలి.   ఎండిన తరువాత నీటితో చక్కగా కడిగేసుకుంటే.. చర్మం భలే స్మూత్‌గా ఉంటుంది. 

మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలే ఒత్తుగా పెరిగేలా  చేస్తుంది.  నాన పెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా  నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో  చాలా సున్నితంగా క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు- నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

పీరియడ్స్‌ సమయంలో  వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.ఐరన్‌ లోపాన్ని కూడా ఈ మెంతులు తగ్గిస్తాయి.  కఫం,దగ్గు, ఆస్తమా  లాంటి సమస్యలకు మెంతు మంచి  ఉపశమనం కలిగిస్తాయి. 

సైడ్‌ ఎఫెక్ట్స్‌
పాలిచ్చే తల్లులకు  పాలు పడటం కోసం మెండి పౌడర్‌ను ఎక్కువగా వాడతారు.   దీని వల్ల పిల్లలకు ఎటువంటి హాని జరగనప్పటికీ,  మెంతి సప్లిమెంట్లను తీసుకునే ముందు వైర్భిణీలేదా పాలిచ్చే స్త్రీలు వైద్యులు సలహా మేరకు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మెంతి సప్లిమెంట్లు లేదా మందులకు దూరంగా ఉండాలంటున్నారు కొంతమంది నిపుణులు.  ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి,  ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 

డెలివరీకి కొద్దిసేపటికి ముందు మెంతులు తీసుకోవడం వల్ల శిశువుల మూత్రం, శరీరంనుండి  అసాధారణమైన వాసన వస్తుంది. ఈ వాసన ప్రమాదకరం కానప్పటికీ, మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అని పిలిచే జన్యుపరమైన పరిస్థితి వస్తుందంటారు.

మెంతులు శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో  కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్‌లలో ఈస్ట్రోజెన్-ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందట.  కనుక మెంతి సప్లిమెంట్లను ఉపయోగించాలనుకుంటే  వైద్యులను   సంప్రదించాలి. 

మరికొన్ని
⇒ అతిసారం
 ⇒ అజీర్ణం
⇒ కడుపు ఉబ్బరం 
⇒ వికారం
⇒ తలనొప్పి
⇒ తలతిరగడం
 

>
మరిన్ని వార్తలు