భోజనం తర్వాత సోంపు తింటే ఏమవుతుందో తెలుసా?

23 Nov, 2023 17:03 IST|Sakshi

రాత్రి పడుకునేముందు గ్లాసు నీళ్లలో టీస్పూను మెంతులు వేసి నానపెట్టాలి. ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలగడంతో΄ాటు, శరీర బరువు అదుపులో ఉంటుంది. రోజూ మెంతుల నీళ్లు తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.

►రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్‌ చల్లని పాలను తాగాలి. పాలను బాగా మరిగించి అనంతరం వాటిని చల్లార్చి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అనంతరం వాటిని నిద్రకు ముందు తాగాలి. ఇలా 3 రోజుల పాటు వరుసగా చేస్తే ఎసిడిటీ తగ్గిపోతుంది.

►రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం కాసిని సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. 

మరిన్ని వార్తలు