పెళ్లి పీటలెక్కనున్న పాక్‌ స్టార్‌ ఆటగాడు.. అమ్మాయి ఎవరంటే?

23 Nov, 2023 17:00 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్ పెళ్లి పీటలకెక్కనున్నాడు. నార్వేకు చెందిన తన చిరకాల ప్రేయసి అన్మోల్ మెహమూద్‌ను ఇమామ్‌ వివాహమాడనున్నాడు. వీరిద్దరి నిఖా నవంబర్‌ 25న లాహొర్‌లో జరగనుంది. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. మంగళవారం(నవంబర్‌ 21) నార్వేలో  మెహందీ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను అన్మోల్ మెహమూద్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. వీరి వివాహ వేడుకకు పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజం, టీ20 కెప్టెన్‌ షాహీన్‌ షా అఫ్రిది, మహ్మద్‌ రిజ్వాన్‌ హాజరకానున్నట్లు తెలుస్తోంది.

A post shared by HSY (@theworldofhsy)

ఎవరీ అన్మోల్ మెహమూద్‌?
అన్మోల్ మెహమూద్‌.. నార్వేకు చెందిన డాక్టర్‌. ప్రస్తుతం ఆమె తన కుటంబ సభ్యులతో కలిసి నార్వేలో నివసిస్తుంది. అయితే ఆమె తన కలిసి సభ్యులతో కలిసి నార్వే​కు వెళ్లకముందు పాకిస్తాన్‌లోనే కొన్నేళ్లు గడిపింది. ఈ క్రమంలోనే మెహమూద్‌తో ఇమామ్‌కు పరిచయం ఏర్పడింది. 

A post shared by Anmol Mehmood (@anmolmehmood)


చదవండివిండీస్ టీ20 ప్రపంచకప్ వీరుడికి బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ..

మరిన్ని వార్తలు