Indrans: 400కు పైగా సినిమాలు.. నాలుగో తరగతిలోనే ఆపేసిన చదువు.. ఇప్పుడు పూర్తి చేస్తానంటున్న నటుడు

23 Nov, 2023 18:00 IST|Sakshi

ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రాన్‌ పదో తరగతి పరీక్షకు సంసిద్ధమవుతున్నాడు. పేదరికం వల్ల బాల్యంలో చదువుకు దూరమయ్యానని అందుకే ఇప్పుడు మళ్లీ బడి బాట పట్టానంటున్నాడు. 67 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసి పాస్‌ అయి చూపిస్తానంటున్నాడు. చిన్నతనంలో ఆపేసిన చదువును ఇప్పుడు తిరిగి కొనసాగిస్తున్నాడు. ప్రతి ఆదివారం స్పెషల్‌ క్లాసులకు హాజరువుతున్నానని, వచ్చే ఏడాది పరీక్షలకు ఇప్పటినుంచే రెడీ అవుతున్నానని తెలిపాడు.

ఎవరీ ఇంద్రాన్స్‌..
నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఇంద్రాన్స్‌ చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అతడి ఇంట ఏడుగురు సంతానంలో ఇంద్రాన్స్‌ మూడోవాడు. చదువుకునే స్థోమత లేక నాలుగో తరగతికే బడికి వెళ్లడం మానేశాడు. కటిక పేదరికం వల్ల విద్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఏదైనా పని చేయాలనుకున్నాడు. తన అంకుల్‌ దగ్గర దుస్తులు కుట్టడం నేర్చుకున్నాడు. మరోపక్క నాటకాలు కూడా నేర్చుకున్నాడు. 'కలివీడు' అనే సీరియల్‌తో తన కెరీర్‌ను మొదలుపెట్టాడు. అటు తన సోదరుడు జయకుమార్‌తో కలిసి కేరళలోని కుమారపురంలో ఇంద్రాన్స్‌ బ్రదర్స్‌ అనే టైలర్‌ షాప్‌ ప్రారంభించాడు.

కమెడియన్‌గా వందలాది సినిమాలు
1981లో 'చూతట్టం' అనే సినిమాతో మలయాళ వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించడమే కాకుండా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గానూ పని చేశాడు. అలా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేస్తూ చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయాడు. 'సీఐడీ ఉన్నికృష్ణన్‌ బీఏ, బీఎడ్‌' సినిమాతో పాపులర్‌ అయ్యాడు. కమెడియన్‌గా వందలాది చిత్రాలు చేశాడు. హోమ్‌ సినిమాకుగానూ జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు.

చదవండి: డాక్టర్‌ బాబు మాస్టర్‌ మైండ్‌.. షాకైన శివాజీ, రైతుబిడ్డ.. ఇదే కంటిన్యూ అయితే టాప్‌ 5!

మరిన్ని వార్తలు