హలోవీన్‌ అంటే ఏంటి? ఈ పండగ రోజు వింత దుస్తులు ఎందుకు ధరిస్తారు?

2 Nov, 2023 16:50 IST|Sakshi

దేవుడున్నాడన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. కూడా దెయ్యాలకూ కొన్ని స్పెషల్‌ డేస్‌ ఉంటాయి. అదే హలోవీన్‌ ఫెస్టివల్‌. ఈ పండగను పురస్కరించుకొని రకరకాల వికృత వేషాలు చూస్తుంటాం. తాజాగా దుబాయ్‌లో అస్తిపంజరం డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

భారతీయ సాంప్రదాయంలో పలు పండగలకు ప్రత్యేకమైన విశిష్టతలున్నాయి. అదే విధంగా దెయ్యాలకూ స్పెషల్‌గా పండగలున్నాయి. అదేనండీ మన హలోవీన్‌ పండగ. ఐర్లాండులో పుట్టిన ఈ పండగ తర్వాతి రోజుల్లో ప్రపంచ దేశాలకూ పట్టింది. హాలోవీన్ అనే స్కాట్లాండ్ పదం ఆల్ హాలో ఈవ్ నుంచి వచ్చింది. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. 

2,000 సంవత్సరాల కిందట ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌‌లోని కొన్ని ప్రాంతాలలో నివసించిన సెల్ట్స్ జాతి ప్రజలు నవంబరు 1ని కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. దానికి ఒకరోజు ముందే హాలోవీన్ వేడుకలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.పండుగ రోజున మంటలను వెలిగించి, దెయ్యాలను పారదోలాలనే ఉద్దేశంతో ప్రజలు విచిత్రమైన వస్త్రధారణలో ఉంటారు.

హలోవీన్‌ పండ అంటే ప్రాణం ఉన్నవారికి, మరణించినవారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని అప్పటి ప్రజలు నమ్మేవారు. పూర్వం ‘హాలోవీన్’ రోజున పశువులను బలి ఇచ్చి, వాటి ఎముకలను కాల్చేవారు. ఈ రోజున చెడు ఆత్మలను అనుకరిస్తూ.. దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది.

హలోవీన్‌ డే వస్తుందంటే చాలు  ప్రజలు పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషాల్లో కనిపిస్తారు. తాజాగా దుబాయ్‌లో హలోవీన్‌ డేను పురస్కరించుకొని భారీ డ్రోన్‌ షోను నిర్వహించారు. ఇందులో ఓ అస్తిపంజరం డ్యాన్స్‌ చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

మరిన్ని వార్తలు