దీపావళి పండుగకి ఈజీగా కాజు పిస్తా రోల్స్‌ చేసుకోండిలా!

10 Nov, 2023 09:55 IST|Sakshi

కాజు పిస్తా చేయడానికి కావలసినవి:
జీడిపప్పు – ఒకటిన్నర కప్పులు 
పిస్తా పప్పు – ఒకటిన్నర కప్పులు
కండెన్స్‌డ్‌ మిల్క్‌ – ఒకటింబావు కప్పులు
గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌ – ఐదు చుక్కలు
బటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
పంచదార పొడి – కప్పు
యాలకులపొడి – పావు టీస్పూను;

తయారీ విధానం: జీడిపప్పును దోరగా వేయించి, మెత్తగా గ్రైండ్‌ చేయాలి. గ్రైండ్‌ అయిన తరువాత జల్లెడపట్టి పొడిని తీసుకోవాలి.  బాణలిలో వెన్న వేసి వేడెక్కనివ్వాలి. కరిగిన బటర్‌లో కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోయాలి. నిమిషం పాటు పాలను కలుపుతూ ఉండాలి. తరువాత జీడిపప్పు పొడి వేయాలి. సన్నని మంటమీద తిప్పుతూ ఐదునిమిషాలు వేయించాలి. తరువాత దించేసి చల్లారనివ్వాలి.  చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని జీడిపప్పు మిశ్రమాన్ని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ∙ఇప్పుడు పిస్తాపప్పుని దోరగా వేయించి మెత్తగా గ్రైండ్‌ చేయాలి

గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని జల్లెడపట్టి మెత్తటి పొడిని తీసుకోవాలి. పిస్తా పొడిలో పంచదార పొడి, యాలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ కొద్దిగా వేడి నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి. ఇప్పుడు జీడిపప్పు ముద్దను రెండు ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను మందపాటి చపాతీలా వత్తుకుని, కాస్త వెడల్పుగా  ఉండేలా ముక్కలు కోయాలి. పిస్తా ముద్దను చిన్న ఉండలుగా చేసి, వీటిని పొడవాటి రోల్స్‌లా చుట్టుకోవాలి. జీడిపప్పు ముక్కపైన పిస్తా రోల్‌ను పెట్టి, జీడిపప్పు ముక్కను రోల్‌ చేయాలి.  పిండి ముద్దను మొత్తాన్ని ఇలా రోల్‌ చేసి, పైన కుంకుమ పువ్వు, సిల్వర్‌ పేపర్‌తో గార్నిష్‌ చేస్తే కాజుపిస్తా రోల్స్‌ రెడీ.  

(చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు)

మరిన్ని వార్తలు