హెల్త్‌ టిప్స్‌: ఈ చిట్కాలు వాడారో.. ఇక‌పై ఆరోగ్య‌ సమస్యలు దూరమే!

23 Dec, 2023 14:01 IST|Sakshi

'మ‌న ఆరోగ్యం బాగుకై ఎన్నో ప్ర‌యత్నాలు చేస్తుంటాం. తీరికలేక మ‌రెన్నో బాధ్య‌త‌లతో ప‌రుగెడుతుంటాం. ఇలాంటి క్ర‌మంలో ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూంటుంది. దుమ్ము, దూళి, టెన్ష‌న్స్‌, అవిరామం మ‌రెన్నో కార‌ణాల‌చే అనారోగ్యం పాలై, బాగుకోసం మెడిసిన్స్ వాడుతుంటాం. ఇక‌పై ఇలాంటి వాటికి స్వ‌స్తి ప‌ల‌క‌డానికి ఈ చిన్న చిన్న ట్రిక్స్ వాడితే ఎంతో మేల‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి అవేంటో చూద్దాం!'

  • కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్‌ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే వ్యర్థపదార్థాల నుంచి కాలేయానికి రక్షణ దొరుకుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.
  • తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి.
  • పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పూను దాకా కడుపులోకి తీసుకోవచ్చు.
  • మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయమవుతుంది. ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్‌ పెరుగుతుంది.
  • అల్లం, జీర్ణశక్తిని పెంచడంతో పాటు కడుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది.
  • పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్‌ తాగినా.. అందులో ఉండే ’మెలటోనిన్‌’ వల్ల చక్కగా నిద్ర పడుతుంది.

ఇవి చ‌ద‌వండి: మీకు తెలుసా! వేడి నీళ్ల‌లో నెయ్యి క‌లిపి తాగితే ఏమౌతుందో!?

>
మరిన్ని వార్తలు