ఎవరెస్ట్‌పై సూపర్‌ డూపర్‌ ‘చెత్త' ఐడియా!

25 Jan, 2021 00:03 IST|Sakshi

మౌంట్‌ ఎవరెస్ట్‌పై టన్నుల కొద్దీ చెత్త పేరుకు పోయింది. ఈ నేపథ్యంలో ‘ఎవరెస్ట్‌ను డంపింగ్‌ సైట్‌గా మార్చవద్దు’ ‘ప్రసిద్ధమైన పర్వతాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో నేపాల్‌ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్‌ చేపట్టింది. దీనిలో భాగంగా ఎవరెస్ట్‌పై పేరుకుపోయిన చెత్తను సేకరించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. చిరిగిన టెంట్లు, ఖాళీ వాటర్‌ బాటిల్స్, విరిగిపోయిన నిచ్చెనలు, తాళ్లు...ఇలా రకరకాల చెత్తను సేకరించారు.
వీటిని విదేశీకళాకారులు, స్వదేశీ కళాకారులు కళాత్మక వస్తువులుగా తయారుచేస్తారు. పర్యావరణ స్పృహను కలిగించడానికి వీటితో ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు చెత్తతో కళాత్మక వస్తువులను తయారుచేయడంలో స్థానికులకు శిక్షణ ఇస్తారు. ‘చెత్తతో అపురూపమైన కళారూపాలు తయారుచేయడమే కాదు ఉపాధి కూడా కలిగించాలనేది మా ప్రయత్నం’ అంటున్నాడు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టామీ గస్టఫ్సాన్‌.

మరిన్ని వార్తలు