అధిక బరువు: మృత్యుమార్గంలో పయనించడమే

1 Mar, 2021 09:02 IST|Sakshi

వాషింగ్టన్‌: ఒక వ్యక్తి ఉండాల్సిన దాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయణించడమేనని యూఎస్‌కు చెందిన ‘ప్లాస్‌’ మెడికల్‌ జర్నల్‌ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో సుమారు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు మూడు లక్షలమందికి పైగా సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది.

మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. 

చదవండికూల్‌డ్రింక్స్‌ తాగితే.. శరీరం చల్లబడుతుందా?

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు