సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!

25 Oct, 2023 11:26 IST|Sakshi

మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనగానే కూరగాయాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ ఇవే గుర్తోస్తాయి. కానీ వీటితోపాటు ఆరోగ్యానికి మంచివి, కొన్ని వ్యాధుల తీవ్రం కాకుండా నిరోధించే మంచి ఔషధగుణాలు కలిగినవి కూడా ఉన్నాయి. వాటిలో ఈ సబ్జగింజలు ఒకటి. వీటిని బేసిల్‌ విత్తనాలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి, కాదు ముఖ సౌందర్యాన్ని ఇమనుడింప చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సబ్జా గింజలు ఆరోగ్య పరంగానూ, ముఖ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం!.

ఆరోగ్యపరంగా..

  • మధుమేహన్ని నియంత్రిస్తాయి. ప్రతీరోజు రెండు స్పూన్ల సబ్జాగింజలు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
  • ఎక్కువగా తినాలన్న కోరికను నియంత్రిస్తుంది
  • భోజనానికి ముందు సబ్జా గింజలను పెరుగులో కలిపి, కొన్ని కూరగాయ ముక్కలను జోడించి తీసుకుంటే మనకు తెలియకుండానే తక్కువగా ఆహారం తీసుకుంటాం.
  • నానాబెట్టిన సబ్జాగింజలను నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. 
  • ఏదోరకంగా సబ్జాగింజలను తీసుకుంటుంటే కడుపు మంటను నియంత్రించడమే గాక శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మారకుండా నియంత్రిస్తుంది

సబ్జాతో మరింత కాంతిమంతం
సబ్జాగింజలను నీటిలో నానబెట్టి , పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను బాదం నూనె వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా రాయాలి. పదినిమిషాలు ఆరాక మరోసారి పూత వేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో మీ ముఖం కాంతిమంతంగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. 

పంటికి జామ
నాలుగు జామ ఆకులని నీటిలో వేసి మరిగించాలి. మరిగిన నీటిని వడగట్టి..గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా పుక్కిలించడం వల్ల పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జామ ఆకుల రసం పళ్లను మరింత దృఢంగా మారుస్తుంది.  

(చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్‌ఫుల్‌ అంటున్న వైద్యులు!)

మరిన్ని వార్తలు