తల్లి ప్రేమకు సరిహద్దులు లేవు

29 Oct, 2023 03:51 IST|Sakshi

వైరల్‌

అమెరికన్‌ మహిళ మేఘన్‌ గత సంవత్సరం అక్టోబర్‌లో మన దేశానికి చెందిన బీదింటి చిన్నారిని దత్తత తీసుకొని ‘అమీ’ అని పేరు పెట్టింది. అమీకు డౌన్‌సిండ్రోమ్‌ ఉంది. దత్తత తీసుకొని సంవత్సరం పూర్తయిన సందర్భంగా హృదయాన్ని కదిలించే వీడియోను మేఘన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. మేఘన్‌కు ఇద్దరు అబ్బాయిలు. వీరితో కలిసి అమీ సంతోషంగా ఆడుకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి.

గత ఫిబ్రవరిలో ఇంటిని దీపావళి పండగ అలంకరణలతో ముస్తాబు చేసి అమీ బర్త్‌డేను ఘనంగా జరిపారు. ‘చిలిపి, తెలివైన, అందమైన చిన్నారికి తల్లి అయినందుకు గర్వపడుతున్నాం. మా ఫ్యామిలీ పజిల్‌ నుంచి తప్పిపోయి మళ్లీ దొరికిన మిస్సింగ్‌ పీస్‌ అమీ’ అంటూ రాసింది మేఘన్‌. ‘మీ సంతోషం సంగతి ఎలా ఉన్నా మీరు ఒక అమ్మాయికి అందమైన, అద్భుతమైన భవిష్యత్తును ఇచ్చారు. దయార్ద్ర హృదయం ఉన్న మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి’ అంటూ నెటిజనులు స్పందించారు.

మరిన్ని వార్తలు