Pneumonia : నిమోనియా.. అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?

3 Dec, 2023 10:14 IST|Sakshi

నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే శ్వాససమస్య. అనేక రకాల ఇన్ఫెక్షన్లు నిమోనియాకు దారితీస్తాయి. ఇలా సెకండరీ ఇన్ఫెక్షన్స్‌తో వచ్చే నిమోనియా ఒక్కోసారి ప్రాణాంత‌కం కూడా కావచ్చు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...  

నివారణ ఇలా...

  • కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం అనే ఓవర్‌ క్రౌడింగ్‌ పరిస్థితికి దూరంగా ఉండాలి. గుంపుల్లోకి వెళ్లకూడదు. ఆస్తమా, బ్రాంకైటిస్‌ బాధితులు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. పొగ‌వాతావరణానికి ఎక్స్‌పొజ్‌ కాకుండా చూసుకోవాలి. అలాగే పొగ‌తాగే అలవాటును తక్షణం మానేయాలి. 
     
  • ఆల్కహాల్‌ అలవాటుకూ దూరంగా ఉండాలి. మద్యం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాదు... మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
     
  • అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లూ నివారితమవుతాయి. 
     
  • చిన్న‌పిల్లలకు, పెద్దవయసు వారికి నిమోనియాను నివారించే వ్యాక్సిన్‌ ఇవ్వడం మంచిది.     

మరిన్ని వార్తలు