రాజస్థాన్‌లో బీజేపీ దూకుడు: ఆధిక్యంలో సెంచరీ మార్క్‌ దాటేసింది!

3 Dec, 2023 10:04 IST|Sakshi

రాజస్థాన్‌లో బీజేపీ 101 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. దాదాపు సగానికిపైగా ఆధిక్యంతో సెంచరీ మార్క్‌ను దాటేసింది. కాంగ్రెస్78 సీట్లతో వెనుకబడి ఉంది.ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీలో 199 సీట్లకు పోలింగ్‌ జరగ్గా అధికార కాంగ్రెస్‌ పార్టీ వెనుకంజలో పడింది. 2018 ఎన్నికల్లో బీజేపీకి 38.77 శాతం, కాంగ్రెస్‌కు 39.30 శాతం ఓట్లు వచ్చాయి.

హోరా హోరీ
రాజస్థాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ సర్దార్‌పురా నియోజకవర్గం నుండి ముందంజలో ఉండగా, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ టోంక్‌లో వెనుకబడి ఉన్నారు.  అలాగే   మాజీ  సీఎం వసుంధర రాజే ఝల్రాపటన్‌లో ఆధిక్యంలో ఉన్నారు.   ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌లాల్ చౌహాన్ వెనుకంజలో ఉన్నారు. 

రెండు పార్టీలు వివిధ స్థాయిలలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు , తిరుగుబాటు అభ్యర్థులను  వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.  టికెట్ నిరాకరించడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి 40 మంది రెబల్స్ పోటీ చేశారు. అటు బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి  సీఎం రేసులో  ప్రధానంగా వినిస్తున్న దియా కుమారి జైపూర్‌లోని గోవింద్ దేవ్‌జీ ఆలయంలో ప్రార్థనలు చేశారు. బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి జైపూర్‌లోని గోవింద్ దేవ్‌జీ ఆలయంలో ప్రార్థనలు చేశారు.

135  సీట్లు మావే, స్వీట్లు పంచేస్తున్నాం
మరోవైపు  విజయం తమదేనని, ప్రస్తుత మెజార్టీ   కొనసాగుతుందని, ఇప్పటికే లడ్డూలను కూడా పంపిణీ చేశామని బీజేపీ నేత సీపీ జోషి వెల్లడించారు.  135 సీట్లు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.  కాగా మూడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా. దీంతో తుది ఫలితాల  కోసం అటు బీజేపీ , కాంగ్రెస్‌ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

మరిన్ని వార్తలు