వింటర్‌లో వివాహా వేడుకలు..ఇలా స్టైలిష్‌గా మారిపోండి

24 Nov, 2023 16:41 IST|Sakshi

వివాహ వేడుకలకు ఎప్పుడూ ఒకే విధంగా ముస్తాబు అవడం బోర్‌ అనిపించినవారు ప్రయోగాత్మకంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. రిసెప్షన్‌ మొదలుకొని సంగీత్, హల్దీ, బ్రైడల్‌షవర్‌ .. అంటూ పెళ్లి వరకు ఈ వింటర్‌ సీజన్‌లో జరిగే ఒక్కో వేడుకకు ఒక్కో స్పెషల్‌ డ్రెస్‌తో స్టయిలిష్‌గానూ, అందంగానూ కనిపించేలా వస్తున్న డిజైన్స్‌ని ఇలా ఫాలో అయిపోవచ్చు. 

లాంగ్‌ కోట్‌ 
శీతాకాలం వెల్వెట్‌ లేదా బ్రొకేడ్‌ ఎంబ్రాయిడరీ లాంగ్‌ కోట్స్‌ అన్ని వేడుకల్లో డ్రెస్సుల మీదకు ధరించవచ్చు. చలి నుంచి రక్షణతో పాటు ఇండోవెస్ట్రన్‌ లుక్‌తో మెరిసిపోతారు. 

ఎంబ్రాయిడరీ ఫ్రాక్‌ స్టైల్‌ 
డ్రెస్సింగ్‌ గ్రాండ్‌గా ఉండాలనుకునేవారు ప్లెయిన్‌ పట్టు క్లాత్‌కి ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దుకోవచ్చు. లెహంగా, ఫ్రాక్, దుపట్టా పూర్తి ఎంబ్రాయిడరీ వేడుకలో రిచ్‌ లుక్‌ను సొంతం చేస్తుంది. 

పట్టు కుర్తా లెహంగా
లాంగ్‌ స్లీవ్స్‌ కుర్తా, లెహంగా, దుపట్టా పట్టు కాంబినేషన్‌తో డిజైన్‌ చేయించుకుంటే వేడుకలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఐదురోజులు జరిగే పెళ్లి వేడుకకు ఏదో ఒకరోజు మీదైన ప్రత్యేకతను చూపించవచ్చు. 

శారీ స్టైల్‌
ఒకేతరహాలో చీరకట్టు ప్రత్యేకత ఏముంది అనుకునేవారు లాంగ్‌ జాకెట్స్‌ లేదా సైడ్‌ కుచ్చుల అలంకరణతో స్టైలిష్‌ లుక్‌ తీసుకురావచ్చు. 

కట్టులో ప్రత్యేకత
ఫ్లోరల్‌ డిజైన్స్‌ ఏ సీజన్‌కైనా బాగా నప్పుతాయి. సిల్క్‌ ఫ్లోరల్‌ శారీని ప్లెయిన్‌ వడ్డాణంతో కలిపి, అందంగా రాప్‌ చేస్తే.. వేడుకలో హైలైట్‌గా నిలవచ్చు. 

కుర్తా పైజామా
క్యాజువల్‌ వేర్‌గా ఉండే ఈ డ్రెస్‌ను ఎంబ్రాయిడరీ, కలర్‌ కాంబినేషన్‌తో వెడ్డింగ్‌ ఔట్‌ఫిట్‌గా మార్చేయవచ్చు.

ధోతీ టాప్‌
ఎంబ్రాయిడరీ లాంగ్‌ స్లీవ్స్‌ టాప్, బాటమ్‌గా ధోతీ ΄్యాంట్‌ వేడుకలో స్పెషల్‌ లుక్‌తో ఆకట్టుకునేలా చేస్తుంది. ధోతీ, టాప్‌లకు చిన్న జరీ అంచు వచ్చేలా డిజైన్‌ 
చేయించుకోవచ్చు.  

మరిన్ని వార్తలు