Anaconda In Amazon Rain Forest: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

21 Feb, 2024 18:17 IST|Sakshi

అనకొండనే ప్రపంచంలో అతిపెద్ద పాము జాతి అని అనుకున్నాం. అదే జాతికి చెందిని మరో జాతి అనకొండను ఈ క్వెడార్‌లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ఈ అనకొండకు సంబంధించి మరో జాతి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ఊహను నిజం చేస్తే మరో జాతి అనకొండ వాళ్ల కంటపడింది. ఇది 26 అడుగుల మరియు 200 కిలోల మేర బరువుంది. ఈ మేరకు శాస్త్రవేత్త విల్‌ స్మిత్‌ల బృందం రానున్న నాట్‌ జియాఓ సిరిస్‌ పోల్‌ టు పోల్‌ కోసం ఫోటో షూట్‌ చేస్తున్నారు.

అందులో భాగంగా ఈ క్కెడార్‌లోని అమెజాన్‌ నది అడుగు భాగంలో ఫోటోలు చిత్రిస్తుండగా ఈ అనకొండ కెమెరాకు చిక్కింది. ఆ సరికొత్త అనకొండను చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు ఇది ఇప్పటి వరకు చూసిన అనకొండ జాతులకు చెందిందా కాదా అనే దిశగా పరిశోధనలు చేశారు. దీన్ని చూసి ఇంతకుముందు కనిపెట్టిన ఆకుపచ్చ అనుకొండకు చెందిన మరోక జాతి ఏమో అనుకున్నారు. కానీ పరిశోధనలో వేర్వేరు జాతికి చెందినదని తేలింది. ఆక్కుపచ్చలో ఉండే అనకొండ జాతి ఎక్కువగా బ్రెటిజల్‌ , పెరూ, బొలీవియా, ఫ్రెంచ్‌ గయానాలలో నివశిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రస్తుతం గుర్తించిన ఈ కొత్తజాతి అనకొండ తొమ్మిది దక్షిణ అమెరికా దేశాలలో బోవా గ్రూప్ సేకరించిన మిగతా అనకొండాల రక్తం, కణజాల నమూనాలతో సరిపోలలేదన్నారు. ఇది అనకొండలో కొత్త జాతిని నిర్థారించారు. దీనికి జెయింట్‌ అనకొండగా నామకరణం చేశారు. ఈ అనకొండ మరింత ప్రమాదకరమైనదని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! మరో టార్జాన్‌, మోగ్లీ లాంటి కథ!)


 

whatsapp channel

మరిన్ని వార్తలు