సంక్షేమ గళం

22 Nov, 2023 01:50 IST|Sakshi

సొంతింటి కల నెరవేరింది

మాది పేద దళిత కుటుంబం. వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తున్నాం. పూరి ఇంట్లో నివసిస్తున్నాం. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మాకు జగనన్న లే అవుట్‌లో సెంటున్నర స్థలం ఇచ్చారు. గృహ నిర్మాణ పథకంలో ఇంటి నిర్మాణానికి రూ.1.80లక్షలు మంజూరయ్యాయి. డ్వాక్రా గ్రూపు ద్వారా వచ్చిన మరికొంత నగదుతో ఇల్లు నిర్మించుకున్నాం. ఎన్నో ఏళ్లుగా డాబా కట్టుకుందామనే కోరిక తీరింది. సొంత ఇంటి కల నెరవేరింది. జగన్‌ రుణం జీవితంలో తీర్చుకోలేం. డాబాలో సంతోషంగా ఉంటున్నాం.

– మత్తే మార్తమ్మ, గుడివాడ, తెనాలి మండలం

u ఆరోగ్యం కుదుటపడింది..

కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నాను. తలతిప్పడం, బీపీ, షుగర్‌ ఉండటంతో పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింది. జగనన్న సురక్ష క్యాంపు గ్రామంలో ఏర్పాటు చేయడంతో అక్కడి వెళ్లాను. వైద్యులు రక్త పరీక్షలు చేశారు. మందులు ఇచ్చారు. బీ–కాంప్లెక్స్‌, షుగర్‌, గ్యాస్‌, మల్టివిటమిన్‌ మాత్రలు, కాల్షియం, బీపీ ట్యాబ్లెట్స్‌ ఇచ్చారు. ఉచితంగా మందులు అందజేశారు. ప్రతి నెల 104 వాహనం రాగానే ఈసీజీ పరీక్ష చేస్తున్నారు. ఇంటికి వచ్చి వైద్య సేవలు ఆరోగ్య సిబ్బంది అందిస్తున్నారు. గతంలో కంటే సురక్ష క్యాంప్‌లో వైద్యులు పరీక్షలు చేసి మందులు ఇచ్చిన అనంతరం ఆరోగ్యం కొంత కుదుటపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను.

– బండికళ్ల సలోమీ, గుడివాడ, తెనాలి మండలం

టీబీ వ్యాధి నయం అయ్యింది

కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతనన్నా. గ్రామంలోని వెల్‌నెస్‌ సెంటర్‌లో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో గుండె, రక్తం, కళ్లే పరీక్షలు చేసి, మందులు ఇచ్చారు. మందులు వాడుతున్నా. ఏఎన్‌ఎం ఇంటికి వచ్చి ప్రతి నెలా మందులు ఇస్తున్నారు. టీబీ నయం అయ్యింది. ప్రస్తుతం ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా లాంటి పేదలకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి జగనన్నకు రుణ పడి ఉంటాం.

– కర్రె జార్జిబాబు,

గుడివాడ గ్రామం, తెనాలి మండలం

మరిన్ని వార్తలు