Hyderabad: రూ.97.30 లక్షల నగదు పట్టివేత

20 Nov, 2023 06:48 IST|Sakshi

పంజగుట్ట: ఎలాంటి పత్రాలు లేకుండా కారులో భారీగా నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు ఆదివారం ఆదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోడుప్పల్‌లో నివసించే మండ అనిల్‌ గౌడ్‌ (31), మహబూబ్‌నగర్‌ జిల్లా మేడిపల్లికి చెందిన ఏర్పుల రవి (35) కారు డ్రైవర్లు. వీరిద్దరు కలిసి ఆదివారం ఉదయం ఎపీ28సీఏ1169 ఇన్నోవా కారులో వెళ్తుండగా..బేగంపేట, గ్రీన్‌ల్యాండ్స్‌ సిగ్నల్‌వద్ద నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీ చేశారు.

కారులో ఉన్న బ్యాగ్‌లో రూ.97.30 లక్షల నగదును గుర్తించారు. వాటికి సరైన పత్రాలు లేకపోవడంతో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక సివిల్‌ కాంట్రాక్టర్‌ వద్ద కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నానని, తన యజమాని మరో బిల్డర్‌కు ఇవ్వమని పంపితే తీసుకువెళ్తున్నానని అనిల్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు