బాల మయూరి అవార్డుల ప్రదానం

20 Nov, 2023 06:48 IST|Sakshi

గన్‌ఫౌండ్రీ: చిన్నారులకు విద్యతో పాటు సాంస్కృతిక, శాసీ్త్రయ, సంగీత కళల్లోను ప్రావీణ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డిప్యూటీ కమిషనర్‌ ఎం.శంకర్‌ అన్నారు. ఆదివారం ఆదర్శ్‌నగర్‌లోని బిర్లామందిర్‌లో కల్చరల్‌ ఫైనార్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జానపద శాసీ్త్రయ సంగీత కళల్లో రాణిస్తున్న చిన్నారులకు బాల మయూరి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్‌ ఆర్‌.కరుణాకర్‌, మై హోమ్‌ ఇండస్ట్రీ సీనియర్‌ డీజీఎం బి.సురేష్‌, ఖమ్మం జిల్లా ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జి.గణేష్‌, ఫెడరేషన్‌ గౌరవ సలహాదారులు వి.వెంకటరమణ, అధ్యక్షుడు ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు