పర్యాటకుల సందడి

20 Nov, 2023 06:48 IST|Sakshi

పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. గోల్కొండ కోటతో పాటు కుతుబ్‌షాహీ సమాదుల ప్రాంతం సైతం పర్యాటక శోభను సంతరించుకున్నాయి. గోల్కొండ కోటకు ఉదయం 7 గంటల నుంచే పర్యాటకులు రావడం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు కోటలో ఎటు చూసినా పర్యాటకులే కానవచ్చారు. యువ జంటలు కోటపై భాగాన చేరి నగరం కనిపించేలా సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. పిల్లలు కోటలోని ఫిరంగులు, ఫౌంటెయిన్‌ల వద్ద సందడి చేస్తూ కానవచ్చారు. మరో వైపు కుతుబ్‌షాహి రాజుల సమాధుల ప్రాంగణమైన సెవన్‌ టూమ్స్‌ సైతం పర్యాటకులతో కిటకిటలాడింది. – గోల్కొండ

మరిన్ని వార్తలు