ఐసోలేషన్‌ వార్డు సిద్ధం..

21 Dec, 2023 06:54 IST|Sakshi

అఫ్జల్‌గంజ్‌: కోవిడ్‌ కేసుల నేపథ్యంలో ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఐసీయూ సహా అవసరమైన అన్ని సౌకర్యాలతో అయిదు పడకల ఐసోలేషన్‌ వార్డు సిద్ధం చేశాం. వెంటిలేటర్ల లభ్యత, ఆక్సిజన్‌ సరఫరా, తగినన్ని ఆర్టీపీసీఆర్‌ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాం. మాస్కుల వినియోగం, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం మెదలైన వాటిపట్ల సిబ్బందికి సూచనలిచ్చాం.

– డాక్టర్‌ బి.నాగేందర్‌, సూపరింటెండెంట్‌, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి

>
మరిన్ని వార్తలు