అటు కిటకిట.. ఇటు తంటా!

17 Jan, 2024 08:21 IST|Sakshi

అబిడ్స్‌: ఎగ్జిబిషన్‌ కిక్కిరిసిపోయింది. నుమాయిష్‌కు మంగళవారం ఒక్కరోజే దాదాపు 75 వేల మంది సందర్శకులు వచ్చారు. గత 16 రోజుల్లో సుమారు 6 లక్షల మంది సందర్శకులు వచ్చారని ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్‌, కార్యదర్శి హన్మంతరావు తెలిపారు. ఎగ్జిబిషన్‌ లోపల, బయట మాలకుంట, అజంతా, గాంధీభవన్‌ గేట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని బేగంబజార్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ తెలిపారు.

ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహంతో నుమాయిష్‌ సందర్శకులు నరకయాతనకు గురయ్యారు. బీజేపీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి దాటి అజంతా గేటు మీదుగా సందర్శకులు ఎగ్జిబిషన్‌ లోపలికి వెళ్లేవారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగర ట్రాఫిక్‌ పోలీసులు అజంతా గేటు ఎదురుగా ఉన్న ముఖ ద్వారాన్ని మూసివేశారు. రోడ్డు అవతలి నుంచి వచ్చేవారు, బీజేపీ కార్యాలయం ప్రధాన రోడ్డుమీదుగా వచ్చేవారు మెట్రోస్టేషన్‌ ఎక్కి రోడ్డు ఇవతలి వైపు మెట్రో స్టేషన్‌ దిగి అజంతా గేటుకు వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలను పెట్టారు. దీంతో వేలాది మంది సందర్శకులు మెట్రోష్టేషన్‌ ఎక్కాలంటే, దిగాలంటే నానా ఇక్కట్ల పాలయ్యారు. గతంలో మాదిరిగానే ప్రధాన రోడ్లపై వాహనాలను నిలిపి సందర్శకులను అజంతా గేటు లోపలికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు