-

డ్రాగన్‌కు దెబ్బ.. ఒకదాని మీద ఒకటి వరుసబెట్టి! షిన్‌జియాంగ్‌ మీదే ఫోకస్‌

22 Dec, 2021 13:17 IST|Sakshi

పశ్చిమ చైనాలో ఏళ్ల తరబడి ఉయిగుర్‌, ఇతర మైనార్టీలపై  కొనసాగుతున్న ఆరాచకపర్వానికి ఎట్టకేలకు చైనా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనను కారణంగా చూపిస్తూ వచ్చే ఏడాది బీజింగ్‌లో జరగబోయే ఒలింపిక్స్‌ను కొన్ని దేశాలు దౌత్యపరమైన బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆంక్షలతో చైనాను మరో దెబ్బ కొట్టింది అమెరికా. ఇక వరుసగా జరుగుతున్న పరిణామాలు..  అంతర్జాతీయ సమాజం ముందు చైనా తన నేరాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి.  


సుమారు పది లక్షల మంది ఉయిగర్లు, టర్కీ మాట్లాడగలిగే ఇతర తెగల వాళ్లు పశ్చిమ చైనాలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. చైనా ప్రభుత్వం వీళ్లను మైనార్టీలుగా గుర్తించింది. అంతేకాదు ఏళ్ల తరబడి వాళ్లపై ఆర్మీ సాయంతో అరాచకాలకు పాల్పడుతోంది. ఉయిగర్ల ఊచకోతను పలు దేశాలు(భారత్‌తో సహా) ఏనాటి నుంచో ఖండిస్తూ వస్తున్నాయి. 

ఉయిగర్లపై చైనా సైన్యం వేధింపులను తెలియజేసేలా.. లండన్‌ ఉయిగర్‌ ట్రిబ్యునల్‌లో సంకెళ్ల ద్వారా నిరసన తెలిపిన ఉయిగర్‌ నేత 

చైనాను ఇరకాట పెట్టినవి.. 

► షిన్‌జియాంగ్‌లో ఉయిగర్లపై హింసాకాండ, రంజాన్‌ సమయంలో మసీదుల విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావడం. 

ఈ తరుణంలో ఇదంతా కేవలం పాశ్చాత్య దేశాల మీడియా స్పృష్టే అని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. 

మరోవైపు ఫారినర్లను, జర్నలిస్టులను గ్జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా చైనా ఆంక్షలు విధించింది. 

అయినప్పటికీ పక్కా ఆధారాలు అక్కడ జరిగే దమనకాండను వెలుగులోకి తీసుకొచ్చాయి.

అమెరికా సహా చాలా దేశాల ఫోకస్‌ ఇప్పుడు గ్జిన్‌జియాంగ్‌ మీదే.

డిసెంబర్‌ 10న లండన్‌లో ట్రిబ్యూనల్‌(ఇండిపెండెంట్‌) ఒకటి.. ఉయిగుర్లకు, ఇతర మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దమనకాండలో చైనా ప్రభుత్వాన్నే దోషిగా ఎత్తి చూపుతూ తీర్పు వెలువరించింది. 

డిసెంబర్‌ 14న అమెరికా చైనాకు ఓ ఝలక్‌ ఇచ్చింది. ఉయిగుర్‌ ఫోర్స్‌డ్‌ లేబర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం.. గ్జిన్‌జియాంగ్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులన్నీ.. ఉయిగుర్లను బలవంతపెట్టి తయారు చేయించిన ఉత్పత్తులు కావని నిరూపించుకోవాల్సి ఉంటుంది.  

డిసెంబర్‌ 16న జో బైడెన్‌ ప్రభుత్వం.. గ్జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని మిలిటరీ మెడికల్‌ సైన్సెన్స్‌, దాని 11 రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్స్‌ మీద ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. 

హైటెక్‌ సర్వయిలెన్స్‌ వ్యవస్థ-ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాయంతో గ్జిన్‌జియాంగ్‌ ప్రజల డీఎన్‌ఏ శాంపిల్స్‌ను చైనా అక్రమంగా సేకరిస్తోందన్నది అమెరికా వాదన. 

భవిష్యత్తులో ఉయిగర్ల హక్కుల్ని పరిరక్షించేందుకు, స్వేచ్ఛను ప్రసాదించేందుకు.. అవసరమైతే చైనాను కడిగిపడేయాలంటూ అమెరికా, ఇతర అగ్రదేశాల సాయం కోరుతోంది ఉయిగర్ల హక్కుల పరిరక్షణ కమిటీ. ఈ తరుణంలో సానుకూల స్పందన ద్వారా చైనాను ఇరుకున పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

► వచ్చే ఏడాది మొదట్లో అంతర్జాతీయ న్యాయస్థానానికి గ్జిన్‌జియాంగ్‌లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనను తీసుకెళ్లాలని(పిటిషన్‌ ద్వారా) అమెరికా భావిస్తోంది.

చదవండి: ఆపరేషన్‌ ‘అన్‌నోన్‌’.. చైనా ఫోన్ల ద్వారా భారీ  కుట్ర

మరిన్ని వార్తలు