లేజర్‌ ట్రీట్‌మెంట్‌: 'అమ్మాయిగా అనిపించట్లేదు'

2 Mar, 2021 20:17 IST|Sakshi

లండన్‌: మరింత అందంగా కనిపించాలని, తన నిగారింపును రెట్టింపు చేసుకోవాలని తహతహలాడిందో బ్యూటీషియన్‌. ఈ క్రమంలో ఒంటి మీద ఉన్న అవాంచిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం లేజర్‌ ట్రీట్‌మెంట్లు తీసుకుంటూ కాస్మొటిక్‌ సర్జరీలు చేయించుకుంది. మొత్తంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది సార్లు హెయిర్‌ రిమూవల్‌ చికిత్స తీసుకుంది. కానీ ఆమె ఆశించినదానికి భిన్నంగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అర్థమై అర్ధాంతరంగా చికిత్సను ఆపేసింది. ఇప్పుడు తనకు తాను అమ్మాయిగా అనిపించడం లేదంటూ చింతిస్తోంది.

2018లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన సన్నా సోహైల్‌ అనే బ్యూటీషియన్‌ అవాంచిత రోమాలను తొలగించేందుకు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఓసారి క్లినిక్‌కు వెళ్లినప్పుడు తనను తాను చూసుకుని తీవ్ర నిరాశ చెందింది. తను ఊహించినట్లుగా అందంగా కనిపించడానికి బదులుగా ఏదో హార్మోన్ల సమస్యలు ఉన్నట్లు నిర్జీవంగా కనిపించింది. దీంతో ట్రీట్‌మెంట్‌ మధ్యలోనే ఆపేసింది. పైగా చికిత్స తీసుకున్నచోట ఓ గడ్డ(కణతి) ఏర్పడింది. దీని గురించి సన్నా మాట్లాడుతూ.. నా చర్మంపైన కణతి ఏర్పడగానే వారు వైద్యుడికి చూపిస్తామన్నారు. ఓ ప్రైవేటు డాక్టర్‌ను సంప్రదించి దాన్ని తీసేయిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు అని సన్నా వాపోయింది.

ట్రీట్‌మెంట్‌ తర్వాత ఎలాంటి మార్పులొస్తాయనే కనీస విషయాలేవీ వాళ్లు నాకు చెప్పలేదు. కణతి ఉన్నప్పుడు లెగ్గిన్లు, అండర్‌వేర్‌తో పాటు టైట్‌ దుస్తులు వేసుకోవద్దని చెప్పలేదు. ఇప్పుడు వాటిని ధరించాలన్నా ఎక్కడ మళ్లీ ఆ కణతి ఏర్పడుతుందోనని భయంగా ఉంది. వీటన్నింటి మధ్య నేను అమ్మాయినే అన్న భావన కలగడం లేదు. ఈ సమస్య వల్ల నేనెప్పటికీ జీన్స్‌ ధరించలేను అని చెప్పుకొచ్చింది. తనను మానసికంగా ఎంతో బాధించిన ఈ సమస్యను సన్నా అంత ఈజీగా వదల్లేదు. లేజర్‌ ట్రీట్‌మెంట్‌ మీద ఆమె పరిశోధనలు చేపట్టింది. ఓ యంత్రాన్ని సైతం కనిపెట్టింది. తను సొంతంగా ఏర్పాటు చేసిన క్లినిక్‌లో ఈ యంత్రాన్ని లాంచ్‌ చేసింది.

చదవండి: ఆటోపై లగ్జరీ హౌజ్‌.. ఆనంద్‌ మహీంద్ర ఫిదా

పట్టుమని పది సెకన్లు ఉన్న వీడియోకు రూ.48 కోట్లు గుమ్మరించారు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు