‘బిల్‌గేట్స్‌ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో..’

1 Jul, 2021 14:33 IST|Sakshi

బిల్‌గేట్స్‌పై సంచలన ఆరోపణలు

న్యూయార్క్‌: విడాకుల ప్రకటన తర్వాత మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన వ్యక్తిత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు జేమ్స్‌ వాల్లేస్‌. జేమ్స్‌ వాల్లేస్‌.. గేట్స్‌ మీద రెండు బయోగ్రఫీలు రాశాడు.అందులో 80, 90 దశకాల్లో మైక్రోసాఫ్ట్‌ తొలినాళ్లలో గేట్స్‌.. విపరీతంగా పార్టీలు నిర్వహించేవాడని, ఆ టైంలో తన పదిహేడు గంటల పని తీరును పక్కనపెట్టాడని వాల్లేస్‌ పేర్కొన్నాడు. 

గేట్స్‌ లోకల్‌ నైట్‌ క్లబ్‌ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకునేవాడు. నగ్నంగా వాళ్లతో కలిసి ఈతలు కొట్టేవాడు. వాళ్ల చుట్టూ తిరిగేవాడు. తప్పతాగి జల్సాలు చేసేవాడని వాల్లేస్‌ ఆరోపించాడు. కొమ్‌డెక్స్‌, డెమో లాంటి సదస్సుల తర్వాత గేట్స్‌.. పార్టీల్లో పాల్గొనేవాడు. ఆ టైంలో బిల్‌గేట్స్‌ తప్పతాగే వాడని గతంలో రాబర్ట్‌ క్రింగ్లే అనే బ్లాగర్‌ రాసిన కథనాన్ని ప్రస్తావించాడు వాల్లేస్‌. 

ఇక ఈ ప్రకటనపై.. బిల్‌ గేట్స్‌ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. విడాకుల ప్రకటన తర్వాతే ఇలాంటి అసత్యమైన, అసంబద్ధమైన ప్రకటనలు వెలువడడం దారుణమని ఆక్షేపించారు. 

స్త్రీ లోలుడు : మాజీ ఉద్యోగి ఆరోపణ

ఇక బిల్‌గేట్స్‌(65)పై మాజీ ఉన్నత ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలకు దిగారు. ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఉద్యోగి.. 1988లో ఓరోజు  ఉదయం ఓ మహిళపై వాలిపోయి కనిపించాడని, అప్పటికే మిలిండా గేట్స్‌తో ఆయన ప్రేమాయణం కొనసాగుతోందని ఆ ఉద్యోగి గుర్తు చేసుకున్నారు. ఇక మరో ఉద్యోగి బిల్‌గేట్స్‌ ఉద్యోగులందరితో సమానంగా ఉండేవాడు కాదని, తనకు నచ్చని వాళ్లపై అరిచేవాడని ఆరోపించారు.

చదవండి: 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు ఎందుకు?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు