టెక్సాస్‌, ఫెడరల్‌ ప్రభుత్వాల మధ్య తీవ్రమవుతున్న సరిహద్దు గొడవ

26 Jan, 2024 13:51 IST|Sakshi

టెక్సాస్‌: సరిహద్దు భద్రతపై అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి మధ్య వివాదం తీవ్రమవుతోంది. అక్రమ వలసలకు మూలంగా మారిన షెల్బీ పార్కులోకి ఎవరినీ అనుమతించేది లేదని టెక్సాస్‌ ప్రభుత్వం తేల్చి చెబుతుంటే సరిహద్దు ఏజెంట్లను అనుమతించాల్సిందేనని ఫెడరల్‌ ప్రభుత్వం పట్టుబడుతోంది. 

జో బైడెన్‌ ప్రభుత్వం సరిహద్దు భద్రతలో వైఫల్యం చెందిందని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ ఆరోపించారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు టెక్సాస్‌ స్టేట్‌ నేషనల్‌ గార్డ్‌, ఇతర బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. 

షెల్బీ పార్కును టెక్సాస్‌ ప్రభుత్వం ఇటీవలే తమ ఆధీనంలోకి తీసుకుంది. రియో గ్రాండేలో ఉన్న ఈ పార్కులోకి ఎవరినీ అనుమతించేంది లేదంటూ ఫెడరల్‌ ప్రభుత్వ ఆదేశాలను కూడా టెక్సాస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వివాదం కారణంగా స్టాండ్‌ విత్‌ టెక్సాస్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 

ఇదీచదవండి.. అమెరికాలో నైట్రోజన్‌ గ్యాస్‌తో మరణ శిక్ష

whatsapp channel

మరిన్ని వార్తలు