కస్టమర్‌ ఇచ్చిన టిప్‌ చూసి డెలివరీ బాయ్‌ షాక్‌!

26 Jul, 2021 15:55 IST|Sakshi

ఫుడ్‌ డెలివరీ యాప్‌లు పెరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున వాటికి ఆర్డర్లు ఇస్తున్నారు. కరోనా సమయంలో ఫుడ్‌ డెలివరీ చేసే వారిని కూడా వారియర్లుగా గుర్తించారు. డెలివరీ యాప్‌లకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ సంఘటన వైరల్‌గా మారింది. ఆర్డర్‌ పెట్టిన కస్టమర్‌కు ఫుడ్‌ డెలివరీ చేసిన బాయ్‌ టిప్‌ అడిగాడు. అయితే అప్పటికే కస్టమర్‌ వద్ద డబ్బులు లేవు. దీంతో ఆ డెలివరీ బాయ్‌కు ఊహించని టిప్‌ ఇచ్చాడు. దాన్ని తీసుకుని డెలివరీ బాయ్‌ వెళ్లిపోయాడు. సీసీ టీవీలో రికార్డయిన ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

అమెరికాలో ఓ వ్యక్తి పిజ్జాహట్‌లో పిజ్జా ఆర్డర్‌ పెట్టాడు. పిజ్జాను తీసుకుని వచ్చి కస్టమర్‌ ఇంటి తలుపు తట్టాడు. టిప్‌ ఇవ్వాలని డెలివరీ బాయ్‌ అడగ్గా.. ‘నా దగ్గర డబ్బులు లేవు. పిజ్జాలో ఒక ముక్క (స్లైస్‌) తీసుకో’ అని కస్టమర్‌ చెప్పాడు. అయితే డెలివరీ బాయ్‌ ‘మీరేమైనా జోక్‌ చేస్తున్నారా’! అని ప్రశ్నించాడు. ‘లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు’ అని చెప్పడంతో డెలివరీ బాయ్‌ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను ఆ కస్టమర్‌ టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశాడు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఆ వీడియోలో టెక్ట్స్‌ రూపంలో వివరించాడు. ఈ భిన్నమైన స్పందన లభిస్తోంది. రింగ్‌డోర్‌బెల్‌ కంపిలేషన్‌ అనే టిక్‌టాక్‌ అకౌంట్‌లో ఈ వీడియో ఉంది.

మరిన్ని వార్తలు