ట్రంప్‌ను పొగడుదామ‌ని త‌ప్పులో కాలేసింది

25 Aug, 2020 14:43 IST|Sakshi

వాషింగ్ట‌న్ : న‌వంబ‌రులో జ‌ర‌గ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు హోరాహోరిగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే డొనాల్డ్‌ ట్రంప్‌కు మ‌ద్ద‌తుగా అమెరికన్ కన్జర్వేటివ్ మాజీ టెలివిజన్ హోస్ట్, టోమి లాహ్రెన్ ఇటీవల చేసిన వ్యాఖ్య‌లు ట్విటర్‌లో ట్రోల్స్‌కు కార‌ణ‌మ‌య్యాయి. భార‌తీయ మ‌ద్ద‌తుదారుల‌ను ఉద్దేశిస్తూ టోమి చేసిన ప్ర‌సంగం నెట్టింట వైర‌లయింది. ‘ట్రంప్‌ను మ‌రోమారు అధ్య‌క్షుడిగా ఎన్నుకుంటే అమెరికా మ‌ళ్లీ ప్ర‌గ‌తిప‌థంలోకి వెళ్తుంది. ఇప్ప‌టిదాకా మ‌ద్ద‌తుగా నిలిచినందుకు చాలా ధ‌న్య‌వాదాలు. ఉల్లు(గుడ్ల‌గూబ‌) లాగే చాలా తెలివైన వారంటూ’ త‌ప్పులో కాలేసింది. హిందీలో ఉల్లు అంటే మూర్ఖుడు అని అర్థం. ‘పాపం ట్రంప్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుదామ‌నుకుంది కానీ భాష రాక పాతాళంలోకి తోసేసింది’ అంటూ ప‌లువురు నెటిజ‌న్లు  టోమిపై జోకులు పేలుస్తున్నారు. (చ‌ద‌వండి : ట్రంప్‌ నిజంగా మూర్ఖుడు.. అబద్దాల కోరు)

డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా మరోసారి గెలిచేందుకు ఆయన వర్గం బాగానే కసరత్తులు చేస్తుంది. అమెరికాలో ఉన్న భారతీయుల ఓట్లను లక్ష్యం చేసుకొని తాజాగా శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. మరో నాలుగేళ్లు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయనను గెలిపించాలంటూ ఆయన మద్దతుదారులు ర్యాలీ తీశారు. దీనికోసం భారత ప్రధాని అమెరికాలో పర్యటించిన హౌడీ మోదీ, డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన నమస్తే ట్రంప్‌కు సంబంధించిన వీడియోలను ప్ర‌ద‌ర్శించారు. మ‌రోవైపు డొమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన జో బైడెన్‌ తన ప్రచారం వేగవంతం చేశారు. అమెరికాలో ఉన్న భారతీయ అమెరికన్ల ఓట్లను ఆకర్షించడానికి ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. (చ‌ద‌వండి : మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు