చికున్‌ గున్యాకు తొలి వ్యాక్సిన్‌

11 Nov, 2023 05:36 IST|Sakshi

న్యూఢిల్లీ: చికున్‌ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచి్చంది. ఇక్స్‌చిక్‌ పేరిట రూపొందిన ఈ వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. 18 ఏళ్లు, ఆ పైబడిన వారికి దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘చికున్‌ గున్యా తీవ్ర వ్యాధికి, దీర్గకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన తక్షణావసరాన్ని ఈ వ్యాక్సిన్‌ తీరుస్తుందని నమ్ముతున్నాం’’ అని వివరించింది. ‘‘ఇక్స్‌చిక్‌ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 266 మంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలొచ్చాయి.

ఉత్తర అమెరికాలో 3,500 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా చక్కని గుణం కనిపించింది. 1.6 శాతం మందిలో మాత్రం తీవ్రమైన తలనొప్పి తదితర గున్యా తాలూకు లక్షణాలు కనిపించాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచి్చంది’’ అని ఎఫ్‌డీఏ సెంటర్‌ ఫర్‌ బయోలాజిక్స్‌ ఎవాల్యుయేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ పీటర్‌ మార్క్స్‌ చెప్పారు. బయోటెక్‌ కంపెనీ ‘వాల్వెవా  ఆ్రస్టియా’ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది.

మరిన్ని వార్తలు