-->

అమెరికాకు ‘స్పేస్‌ ఎక్స్‌’ నిఘా ఉపగ్రహాలు!

18 Mar, 2024 06:04 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన ‘స్పేస్‌ ఎక్స్‌’ కంపెనీ కేవలం అంతరిక్ష ప్రయోగాలే కాదు, నిఘా ఉపగ్రహాల తయారీకి సైతం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్పేస్‌ ఎక్స్‌తో అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ‘ఎన్‌ఆర్‌ఓ’ డీల్‌ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 2021లోనే ఒప్పందం కుదిరిందని, ఈ కాంట్రాక్టు విలువ 1.8 బిలియన్‌ డాలర్లు అని తెలియజేశాయి.

దీనిప్రకారం ఎలాన్‌ మస్క్‌ సంస్థ వందలాది నిఘా ఉపగ్రహాలను తయారు చేసి, ఎన్‌ఆర్‌ఓకు అప్పగించాల్సి ఉంటుంది. అమెరికా భద్రతా సంస్థలు, ఎలాన్‌ మస్క్‌ కంపెనీ మధ్య బలపడుతున్న బంధానికి ఈ ఒప్పందమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ ఉపగ్రహాలు. భూగోళంపై ప్రతి ప్రాంతంపై డేగ కన్నేస్తాయి. అమెరికా సైనిక ఆపరేషన్లకు తోడ్పాటునందిస్తాయి. లక్ష్యాలను కచ్చితంగా గుర్తించడానికి సహకరిస్తాయి. వీటితో అమెరికా ప్రభుత్వానికి, సైన్యానికి చాలా ప్రయోజనాలే ఉంటాయిని నిపుణులు పేర్కొంటున్నారు.

Election 2024

మరిన్ని వార్తలు