సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!

30 Dec, 2021 09:12 IST|Sakshi

సడన్‌గా చూస్తే.. సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోంది కదూ.. నిజానికిది పూర్తిగా కట్టేసిన బిల్డింగ్‌.. దీని డిజైనే అంత.. ఇలాంటి వింత డిజైన్‌ సృష్టికర్త నెదర్లాండ్స్‌కు చెందిన 
ఎంవీఆర్‌డీవీ సంస్థ. ఆమ్‌స్టర్‌డంలో 75 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మూడు భవంతుల సముదాయాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. దూరం నుంచి అలా కనిపిస్తోంది గానీ.. దగ్గర్నుంచి చూస్తే.. దేనికది బ్లాక్స్‌లాగ కట్టినట్లు ఉంటుంది.

అంతేకాదు.. వీటిపైనే ఎక్కడికక్కడ మొక్కలు, చెట్లను పెంచుతారట. మొత్తం 13 వేల రకాల మొక్కలు, చెట్లకుఇది నిలయంగా మారుతుందని చెబుతున్నారు. ఈ భవంతుల సముదాయంలో వాణిజ్య కార్యాలయాలతోపాటు 200 అపార్టుమెంట్లు, రూఫ్‌ గార్డెన్, స్కైబార్‌ ఉంటాయి.   

మరిన్ని వార్తలు