53 సభ్యులతో కూడిన సబ్‌మెరైన్‌ గల్లంతు

22 Apr, 2021 11:31 IST|Sakshi

జకార్తా: 53 మంది సభ్యులతో కూడిన సబ్‌మెరైన్‌ గల్లంతైంది. ఈ దారుణం ఇండోనేషియాలో బుధవారం చోటు చేసుకుంది. మిలిటరీ చీఫ్‌ హదీ తహ్జం తెలిపిన వివరాల ప్రకారం.. మిలిటరీ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహిస్తుండగా ‘కేఆర్‌ఐ నంగాల 402 సబ్‌మెరైన్‌’ గల్లంతైందని తెలిపారు. బాలి దీవి ఉత్తర తీరం నుంచి నీటిపై 95 కిలోమీటర్ల దూరం తర్వాత దాని నుంచి సిగ్నల్స్‌ సరిగా రాలేదు. ఎంత సేపటికీ ఆ సబ్‌మెరైన్‌ నుంచి ఎటువంటి సమాచరం రాకపోవడం, సిగ్నల్స్‌ మొత్తంగా బ్లాక్‌ కావడంతో మునిగిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు.  మెరైన్‌ను కనుగొనేందుకు సింగపూర్, ఆస్ట్రేలియాల సాయం కోరామని ఆయన అన్నారు. 

హైడ్రోగ్రాఫిక్‌ సర్వే షిప్‌ సైతం నీటి మీద తిరుగుతూ మెరైన్‌ జాడను పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా స్పష్టమైన ఆచూకీ తెలియడం లేదు. ఇండోనేషియా మీడియా చూపిస్తున్న వివరాల ప్రకారం సముద్ర మట్టం నుంచి 2,300 అడుగుల లోతులో అది మునిగిపోయినట్లు తెలుస్తోంది. సబ్‌మెరైన్‌ ప్రారంభమైన చోట ఆయిల్‌ లీకైన జాడలను ఓ హెలికాప్టర్‌ గుర్తించిందని అందులో పేర్కొన్నారు. బహుశా ఈ ప్రమాదానికి కారణం ఆయిల్‌ లీకేనని అధికారులు భావిస్తున్నారు.

( చదవండి: జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకేసు: అతడే దోషి )

మరిన్ని వార్తలు