Ivanka Trump: ఇజ్రాయెల్‌ బంధీలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నా

22 Dec, 2023 18:52 IST|Sakshi

గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. హమాస్‌ను పూర్తిగా అంతం చేయాడమే లక్ష్యంగా కాల్పుల విరమణకు కూడా అంగీకరించకుండా ముందుకు సాగుతున్నాయి ఇజ్రాయెల్‌ సేనలు. తాజాగా  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌, అల్లుడు జార్డ్ కుష్న‌ర్ ఇజ్రాయెల్‌ పర్యటించారు. అక్టోబర్‌ 7ను ఇజ్రాయెల్‌ దాడులు చేసి.. తమ వెంట ఇజ్రాయెల్‌ బంధీలుగా తీసుకెళ్లిన పౌరుల బాధిత కుటుంబాలను వారు పరామర్శించారు. 

‘నేను ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టగానే తీవ్రమైన దుఖంతో కూడిన భావోద్వేగానికి లోనయ్యా. అక్టోబర్ 7న జరిగిన దాడుల పరిణామాల్లో బాధితుల కుటుంబ సభ్యుల హృదయవిదారకమైన బాధలు విన్నా. ఇలాం‍టి కఠికనమైన సమయాల్లో ఆశ, మంచితనం ఎప్పటికీ మన వెంటే ఉంటాయని గుర్తు చేస్తాయి. హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ బంధీలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. 

‘హమాస్‌ అనాగిరిక చర్యల వల్ల బాధితులుగా మారినవారి పరిస్థితును  స్వయంగా మన కళ్లతో చూడటం చాలా ముఖ్యం’ అని జార్డ్ కుష్న‌ర్ ఎక్స్‌( ట్విటర్‌)లో పోస్టు చేశారు. ‘హమాస్‌ చేత కిడ్నాప్‌ చేయబడిన వారి కుటుంబ సభ్యులు కలిశాము. ఇంకా కొంత మంది గాజాలోని హమాస్‌ చెరలోనే ఉన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపే పలు రాజకీయ నాయకులను కూడా కలుసుకున్నాం. సంకల్పం, విశ్వాసం, నమ్మకం, గతంలో ఊహించలేనిది కూడా పొందవచ్చు’ అని జార్డ్‌ తెలిపారు. యూదులైన జార్డ్ కుష్న‌ర్, ఇవాంకా ట్రంప్‌.. గత డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో కీలకమైన పదవులను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2024 అమెరికా ఎన్నికల ప్రచారం మాత్రం వీరు పాల్గొనపోవడం గమనార్హం​.     

గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ హమాస్‌ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు, సుమారు 20 వేల మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందినట్లు ఇరు దేశాల అధికారలు వెల్లడించారు. హమాస్‌ చేసిన దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై దాడులను భీకరస్థాయిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడి చేసినప్పుడు.. ఇజ్రాయెల్‌ దేశ నాయకత్వంపై విమర్శలు గుప్పించిన ట్రంప్‌ అనంతరం తన వైఖరి మార్చుకొని మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 
చదవండి: 'లొంగిపోవడం లేదా చావడం'.. హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం

>
మరిన్ని వార్తలు