బైడెన్‌తో జిన్‌పింగ్‌ భేటీ

16 Nov, 2023 06:24 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ సమావేశానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన ఈ భేటీ జరుగనుంది. ఇటీవలి కాలంలో అమెరికా–చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురు నాయకుల సమావేశం అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధాలను పునరుద్ధరించుకొనే దిశగా వారిద్దరూ చర్చలు జరుపునున్నట్లు తెలుస్తోంది. ఆసియా–పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్‌ మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయన అమెరికాకు రావడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి.  

మరిన్ని వార్తలు