వైరల్‌: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!

16 May, 2021 09:37 IST|Sakshi

వాషింగ్టన్‌: పిల్లలకి బొమ్మలంటే మహా సరదా. అలాగే ఇంట్లో ఉండే పెంపుడు జంతువులతో ఆడలాడుతుంటారు. వాటి చెవులు పీకుతూ.. జూలు దువ్వుతూ.. సరదాగా గడుపుతారు. తాజాగా ఫిలడెల్ఫియా జూలో చిరుతతో ఓ చిన్నారి ఆట వైరల్‌గా మారింది. తమ బిడ్డతో జూకి వెళ్లిన తల్లిదండ్రులు ఆమెను పులి ఎదుట నిలిపారు. వారు కొం‍త దూరంలో ఉండి తమ కూతురిని గమనించారు. ఆమె పులిని పెంపుడు పిల్లి అనుకుందో..ఏమో.. దానికి హాయ్‌ చెప్పింది. తన చేతిలో ఉన్న బొమ్మతో చిరుతను ఆటపట్టించింది. అయితే, చిరుత అమాంతం ఆ పసిపాప పైకి దూకే ప్రయత్నం చేసింది. చిన్నారి చేతిలోని బొమ్మవైపు అదోలా చేసి.. దాన్ని తినేయాలి అనేంత కసిగా.. వారి మధ్య అడ్డుగా ఉన్న గాజు గోడను గోళ్లతో రక్కింది.  

కాగా, ఈ వీడియోను  లారా ఫ్రేజర్ అనే వ్యక్తి రికార్డు చేసి "ప్లే డేట్‌" క్యాప్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం సాయంత్రం పోస్ట్‌ చేయగా 93 వేల మంది వీక్షించారు. వేల మంది కామెంట్‌ చేశారు. ఈ వీడియోలో చిన్నారి తన చేతిలోని బొమ్మతో చిరుతను ఆట పట్టిస్తుంది. తన చేతిలో ఉన్న బొమ్మను గాజు ముందు ఉంచిన ప్రతిసారీ చిరుత దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. " చిన్నారి చిరుతను చూసి పిల్లి అనుకుంటోంది’’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.." చిరుత చిన్నారిని చూసి రుచికరమైన ఆహారం అనుకుంటోంది." అని మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. " అడ్డుగా గాజు గోడ లేకుంటే. ఏమై ఉండేదో.."అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు.

(చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు)
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు