దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!

13 Nov, 2023 12:51 IST|Sakshi

దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి. దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి రోజున ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. అయితే దీపావళి వేళ ఒక మహిళ వినూత్నంగా అలంకరించుకుంది. ఇళ్లను అలంకరించేందుకు వినియోగించే చిరు దీపాలను తన దుస్తులకు అల్లుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దీపావళికి ఇటువంటి దుస్తులు పర్ఫెక్ట్‌‌ అని కితాబిస్తున్నారు. 

వర్షా. యాదవ్‌ పేరిట ఉన్న ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. వీడియోలో ఒక మహిళ ఘాగ్రా చోళీని ధరించి కనిపిస్తుంది. ఘాగ్రాతో పాటు వేసుకున్న చున్నీకి రంగురంగుల దీపాలు అతికించి ఉన్నాయి. కాంతులీనుతున్న ఈ దుస్తులను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు దాదాపు 5 లక్షల లైక్స్  వచ్చాయి. లెక్కకు మించిన కామెంట్లు కూడా వస్తున్నాయి. 
ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు!

మరిన్ని వార్తలు