అతడి ప్రాణాలు కాపాడాలంటే 24 కిలోల కిడ్నీలు తీసేయాలి.. 

20 Jun, 2021 14:43 IST|Sakshi
కడ్నీల సమస్య ముదిరిన తర్వాత.. అంతకుముందు

ఒట్టావా: కిడ్నీలకు సంబంధించిన ఓ జన్యుపరమైన లోపం అతడి పాలిట శాపంలా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ మరణానికి దగ్గర జేస్తోంది. భారీగా ఉబ్బిపోయిన కిడ్నీలు శరీరంలోని ఇతర ముఖ్యమైన భాగాల్ని పూర్తిగా నలిపేసి అతడి ప్రాణాలు తీయబోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని విండ్సర్‌కు చెందిన 54 ఏ‍ళ్ల వారెన్‌ హిగ్స్‌ పోలిసిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌ అనే జన్యుపరమైన లోపంతో బాధపడుతున్నాడు.

ఈ లోపం కారణంగా అతడి రెండు కిడ్నీలు భారీగా ఉబ్బటం మొదలుపెట్టాయి. ఎడమ కిడ్నీ 42 సెంటీ మీటర్ల పొడవు, 27 సెంటీ మీటర్ల వెడల్పు.. కుడి కిడ్నీ 49 సెంటీమీటర్ల పొడవు, 28 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. రోజు రోజుకూ పెరుగుతూ పోతున్న కిడ్నీల కారణంగా అతడి శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలు నలగటం ప్రారంభమైంది.

ఇది ఇలాగే కొనసాగితే అతడి ప్రాణాలు పోయే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. జులై నెలలో అత్యంత ప్రమాదకరమైన శస్త్ర చికిత్సను నిర్వహించనున్నారు. ఇండియాలోని ఓ వ్యక్తి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడని.. అతడి కిడ్నీలు 7.4 కేజీలు ఉండగా.. వారెన్‌ కిడ్నీలు అంతకంటే మూడు రెట్లు (దాదాపు 24 కిలోలు) అధిక బరువున్నాయని తెలిపారు. కిడ్నీల సమస్య కారణంగా వారెన్‌ ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కిడ్నీలు తీసేయటం తప్పని సరైంది.

చదవండి : ‘నేనిలా బతకలేను.. ట్రీట్‌మెంట్‌ ఆపేయండి!’

మరిన్ని వార్తలు