New Covid Variant Omicron In New York: న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

27 Nov, 2021 16:30 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ బి.1.1.529 హడలెత్తిస్తోంది. ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఈ వేరియంట్‌లో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్‌ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా కొత్త వేరియంట్‌ B.1.1.529కు ‘ఒమిక్రాన్‌’గా నామకరణం చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూహెచ్‌ ఒమిక్రాన్‌ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్‌ జాబితాలో చేర్చింది.

చదవండి:  ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్‌ఓ ఏమంటోంది?

అయితే ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రం ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్‌ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో శుక్రవారం పేర్కొన్నారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పటివరకు కొత్త వేరియంట్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కానీ, పలు దేశాల్లో ఒమిక్రాన్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే శీతాకాలంలో కరోనా వైరస్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని, కోవిడ్‌ చికిత్సలకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

చదవండి: Omicron: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు

మరిన్ని వార్తలు