పాక్‌లో జిహాద్‌ పేరుతో నిధులు సేకరించొద్దు

28 Jan, 2022 05:35 IST|Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌లో జిహాద్‌ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది.

‘తెహ్రీకీ తాలిబాన్‌ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్‌ పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.    

మరిన్ని వార్తలు