నోబెల్‌ 2022: ఆమెతో సహా ముగ్గురికి కెమిస్ట్రీలో నోబెల్‌.. ఆయనకు రెండోది!

5 Oct, 2022 16:32 IST|Sakshi

స్టాక్‌హోమ్‌: రసాయన శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్‌ ప్రైజ్‌ను ప్రకటించారు. అమెరికా శాస్త్రవేత్తలు కరోలిన్‌ బెర్టోజి, బ్యారీ షార్ప్‌లెస్‌తో పాటు డెన్మార్క్‌కు చెందిన మోర్టన్‌ మెల్డల్‌లకు సంయుక్తంగా ప్రైజ్‌ను ప్రకటించింది కమిటీ.  

భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్టాక్‌హోమ్‌(స్వీడన్‌) రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ మేర ప్రకటన చేసింది. క్లిక్ కెమిస్ట్రీ, బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం వీళ్లు చేసిన కృషికిగానూ నోబెల్‌ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు కమిటీ తెలిపింది. 

ఇదిలా ఉంటే.. షార్ప్‌లెస్‌కు ఇది రెండో నోబెల్‌ ప్రైజ్‌. 2001లో ఆయన రసాయన శాస్త్రంలోనే నోబెల్‌ అందుకున్నారు. 

మరిన్ని వార్తలు