Namaz At Paris Airport: పారిస్‌ ఎయిర్‌ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం!

7 Nov, 2023 12:54 IST|Sakshi

ఇజ్రాయెల్- హమాస్ మధ్య నెల రోజులుగా యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పారిస్‌లోని చార్లెస్‌ డి గల్లె విమానాశ్రయం డిపార్చర్ హాల్‌లో 30 మంది ముస్లింలు  నమాజ్ చేశారు. 

విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో ఈ ప్రార్థనలు జరిగాయి. ఈ ఉదంతంపై ఫ్రాన్స్ మాజీ మంత్రి నోయెల్ లెనోయ్ స్పందిస్తూ ఎయిర్‌ పోర్టులో నమాజ్ చేయడం విచారకరమని అన్నారు. ప్రార్థనల కోసం తగిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయని, అక్కడ వీటిని నిర్వహించుకోవాలని అన్నారు. ఎయిర్‌ పోర్టులో ఇలాంటి చర్యలను అరికట్టాలని, నిఘా మరింతగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో  షేర్‌ చేశారు. విమానాశ్రయం ప్రార్థనా స్థలంగా మారినప్పుడు సీఈఓ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా  ‘విమానాశ్రయంలో ప్రత్యేక ప్రార్థన స్థలం అందుబాటులో ఉందని, ఎయిర్‌పోర్టులో నిబంధనలను అమలు చేసేందుకు విమానాశ్రయ అధికారులు కట్టుబడి ఉన్నారని ఫ్రెంచ్ రవాణా మంత్రి క్లెమెంట్ బ్యూన్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధ నేపధ్యంలో ముస్లింలకు మద్దతుగా పారిస్‌ ఎయిర్‌పోర్టులో నమాజ్‌ చేశారని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మనిషి దీర్ఘాయుష్షు ఎంత?

మరిన్ని వార్తలు