ఇజ్రాయెల్‌లో అనుమతి లేకుండా పెగసస్‌ వాడకం

2 Feb, 2022 10:14 IST|Sakshi

జెరూసలేం: తమ దేశ పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడానికి పరిశోధక సిబ్బంది అత్యాధునిక స్పైవేర్‌ను అనుమతి లేకుండా ఉపయోగించినట్లు ఆధారాలను గుర్తించామని ఇజ్రాయెల్‌ నేషనల్‌ పోలీసు ఫోర్స్‌ మంగళవారం ప్రకటించింది. ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ అభివృద్ధి చేసిన పెగసస్‌ స్పైవేర్‌ను పోలీసులు ఉపయోగించారంటూ ఇజ్రాయెల్‌ పత్రిక రెండు వారాల క్రితం ప్రకటించింది.

దీనిపై దేశమంతా దుమారం రేగుతోంది. నిరసనకారులు, రాజకీయ నాయకులు, నేరగాళ్లపై నిఘా కోసం పోలీసులు ఈ స్పైవేర్‌ను సంబంధిత న్యాయమూర్తి నుంచి అనుమతి తీసుకోకుండానే ఉపయోగించారని సదరు పత్రిక వెల్లడించింది. ప్రజల వినతి మేరకు దీనిపై అటార్నీ జనరల్‌ దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు